YS Jagan: ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లింపునకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్..
గ్రామీణ రహదారులు రిపేర్ కోసం వెంటనే టెండర్లు పిలవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది... ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం జగన్..
గ్రామీణ రహదారులు రిపేర్ కోసం వెంటనే టెండర్లు పిలవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పధకం, గ్రామీణ రహదారులు, తాగునీటిపై ఈ సమీక్షలో కీలకంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెరువులను కాల్వల ద్వారా అనుసంధానం చేసే దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చే ఐదేళ్లలో ప్రతీ చెరువుకు కెనాల్స్, ఫీల్డర్ ఛానెల్స్‌కి లింక్ చేయగలిగితే నీటి ఎద్దడిని నివారించవచ్చునన్నారు సీఎం జగన్.
కడప, అనంతపురం లాంటి ప్రాంతాల్లో కాల్వల ద్వారా ట్యాంకులను కనెక్ట్ చేయాలన్నారు. దీనికి సంబంధించి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. అలాగే ఈ నెల రెండో వారానికి గ్రామీణ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. 9 వేల కిలోమీటర్ల రహదారుల మరమత్తు కోసం ప్రభుత్వం 1073 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. గ్రామాల్లో ఇక తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లింపులు జరిపేందుకు సీఎం ఆదేశించారని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు తెలిపారు. ఉపాధి హామి బిల్లు 1900 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.