కోనసీమ, ఫిబ్రవరి 2: అంబెడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం, అమలాపురం పరిసరాల్లో రోజు రోజుకు మంచు పెరిగిపోతోంది. మంచు అందాలతో కోనసీమ కొత్త అందాలను సంతరించుకుంటుంది.పచ్చని కొబ్బరి చెట్లపై స్నోఫాల్ చూపరులను కట్టిపడేస్తుంది. ఉదయ 9 గంటలు దాటినా మంచు తగ్గకపోవడంతో ప్రకృతి ప్రేమికుల మంచు అందాలను ఎంజాయ్ చేస్తున్నారు. కవి కూడా వర్ణించలేని అద్భుతమైన ప్రకృతి సహజ సిద్ధమైన అందాలు కోనసీమ సొంతం అంటూ మురిసిపోతున్నారు కోనసీమ వాసులు. ఈరోజు ఉదయం అంబెడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట లో కనిపించిన మంచు అందాలు టీవీ9 కెమేరాకు చిక్కాయి. కోనసీమ ఒక్కసారిగా కేరళ , ఊటీ, కోడైకెనల్ , లంబసింగి అందాలు కోనసీమ అంబాజిపేటలో కనిపించాయి. కోనసీమ అంటేనే ప్రకృతి అందాల రామణియతకు పెట్టిన పేరు. అలాంటి కోనసీమకు మంచు అందాలు తోడైతే ఇక వర్ణించలేని విధంగా ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది. పచ్చటి చేల మధ్య, చెట్ల మధ్య మంచు అందరిని చూస్తూ తనివి తీరా ఆస్వాదిస్తున్నారు ప్రకృతి ప్రేమికులు..
కాగా ప్రతీయేట శీతాకాలంలో కోనసీమ జిల్లాలో మంచు అధికంగా కురుస్తుందన్న సంగతి తెలిసిందే. ఉదయ వేళల్లో అక్కడి పచ్చని చెట్ల మధ్యలో కురిసే మంచు చూపరులను ఆకట్టుకుంటుంది. దీంతో ప్రకృతి ప్రేమికులు ఈ కాలంలో కోనసీమ కొబ్బరి చెట్ల మధ్యలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.