Vizag: డబ్బులు కోసం ఏటీఎంకి వెళ్లగా.. అక్కడ కనిపించిన సీన్‌కు మైండ్ బ్లాంక్!

మనీ డ్రా చేయడానికి ఏటీఎంకి వెళ్తున్నారా.. జాగ్రత్త.. లోపలికెళ్లాక ఎలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుందో.. డోరు పక్కన నక్కి ఒక్కసారిగా మీపైన ఎటాక్‌ చేయొచ్చు..

Vizag: డబ్బులు కోసం ఏటీఎంకి వెళ్లగా.. అక్కడ కనిపించిన సీన్‌కు మైండ్ బ్లాంక్!
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: May 16, 2023 | 3:51 PM

మనీ డ్రా చేయడానికి ఏటీఎంకి వెళ్తున్నారా.. జాగ్రత్త.. లోపలికెళ్లాక ఎలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుందో.. డోరు పక్కన నక్కి ఒక్కసారిగా మీపైన ఎటాక్‌ చేయొచ్చు.. లేదా మెషిన్‌లో కార్డు పెడుతున్నప్పుడు వెనుకగా వచ్చి కాలు పట్టుకోవచ్చు.. ఏంటీ.. నస ఆపి విషయానికి రమ్మంటారా.. అక్కడికే వస్తున్నా..! లేట్ ఎందుకు ఈ స్టోరీ చదివేసేయండి..

మనీ డ్రా చేసేందుకు ఏటీఎంకి వెళ్లిన కస్టమర్లు భయంతో ఒక్క ఉదుటన పరుగులు తీశారు. విశాఖ లోని సింధియా షిప్‌ యార్డ్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఉన్న ఓ బ్యాంకులోని ఏటీఎంలో నాగుపాము దూరింది. నగదు తీసుకుందామని లోపలికి వెళ్లిన కస్టమర్‌ అక్కడ బుసలు కొడుతూ కనిపించిన పామును చూసి షాకయ్యాడు. పడగ విప్పి ఎవరొస్తారో రండి అన్నట్టుగా కూర్చున్న ఐదు అడుగుల నాగుపామును గజగజా వణుకుతూ లగెత్తాడు. అనంతరం విషయం బ్యాంకు సిబ్బందికి చెప్పడంతో వారు స్నేక్ క్యాచర్ కు కాల్ చేశారు.

రంగంలోకి దిగిన స్నేక్‌ క్యాచర్‌ చాకచక్యంగా పామును బంధించి సురక్షిత ప్రాంతంలో వదలిపెట్టారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఎండలు మండిపోతుండటంతో ఉపశమనం కోసం పాము ఏటీఎంలో చేరి ఉంటుందని భావించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చేరి వైరల్‌గా మారింది. ఏటీఎంలో పామును చూసి నెటిజన్లు ఒకింత భయాందోళన చెందుతున్నారు. ఎందుకైనా మంచిది ఏటీఎంలోకి వెళ్లేటప్పుడు ఓసారి చెక్‌చేసుకోమని సూచిస్తున్నారు.