Nellore: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి కేసులో 6గురు నిందితుల అరెస్టు.. తీగ లాగితే డొంక కదిలినట్లు..
ఆర్టీసీ డ్రైవర్ రామ్ సింగ్ పై దాడి చేసిన వారిలో ప్రధాన సూత్రదారి అయిన సుధీర్ పై కేసు నమోదు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. సుధీర్ పై ఇప్పటికే వున్న కేసులు వివరాలు చూసి షాక్ తిన్నారు పోలీసులు. దొంగ నోట్ల మార్పిడి, తక్కువ ధరకు బంగారు అమ్ముతామని ఆశ చూపి మోసం చేయడం తో పాటు కోట్ల రూపాయల మేర చీటింగ్ చేసినట్లు ఇప్పటికే కేసులు నమోదు కావడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఓవరాక్షన్ చేసిన వారిని అరెస్ట్ చేస్తే అసలు కేసు పోయి సంచలన నిజాలు బయటపడ్డాయి. ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటన లో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసుల దృష్టికి మరో విషయం వచ్చింది. ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన కేసు సంగతి అటుంచితే కోట్ల రూపాయల చీటింగ్ వ్యవహారం వెలుగు చూసింది. ఒక్క చీటింగ్ కేసేంటి దొంగ నోట్ల మార్పిడి తో పాటు తక్కువ ధరకు బంగారం ఇస్తానని పలువురిని మోసం చేసిన కేసులు బయటకి రావడంతో పోలీసులు సైతం ముక్కున వేలు వేసుకుంటున్నారు.
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో గత రెండు రోజుల క్రితం విజయవాడ కి చేందిన ఆర్టీసీ బస్సు కావలికి వచ్చి తిరిగి వెళ్తుండగా పట్టణంలోని మెయిన్ రోడ్డు లో ముందు వెళ్తున్న వాహనం సైడ్ ఇవ్వక పోవడంతో ఆర్టీసీ బస్ డ్రైవర్ రామ్ సింగ్ హారన్ కొట్టాడు. అయితే బస్సు డ్రైవర్ హారన్ కొట్టడంతో కోపం వచ్చిన వాహనం యజమాని బస్సును రోడ్డుపై ఆపి ఆర్టీసీ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు. అయితే రోడ్డుపై ట్రాఫిక్ ఆగిపోవడంతో స్థానిక పోలీసులు అటు వాహన యజమానికి, ఆర్టీసీ డ్రైవర్ కి సర్ది చెప్పి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
అనంతరం బస్సు కావలి టౌన్ దాటి హైవే పై కి వచ్చిన తరవాత ఆర్టీసీ డ్రైవర్ రామ్ సింగ్ తో గొడవ పెట్టుకున్న దేవరకొండ సుధీర్ మరో రెండు వాహనాలను కలిపి మొత్తం మూడు వాహనాలను బస్సుకు అడ్డంగా పెట్టి బస్సుని ఆపాడు. ఆ బస్సు డ్రైవర్ రామ్ సింగ్ పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. బస్సులో ప్రయాణికులతో పాటు బస్సులో ని మరో డ్రైవర్ అడ్డురావడంతో వారిపై సైతం దాడి చేశాడు. అయితే ఇదంతా సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్న ఓ ప్రయాణికుడు సెల్ ఫోన్ సైతం పగులకొట్టి నడి రోడ్డుపైనే రామ్ సింగ్ ని కాలితో తంతూ దాడి చేయడం బస్సు లోని ప్రయాణికులను సైతం కలిచివేసింది.
దాడి పై రామ్ సింగ్ ఫిర్యాదు చేసినప్పటికీ తొలుత పోలీసులు కేసును లైట్ తీసుకున్నారు. అయితే బస్సు డ్రైవర్ రామ్ సింగ్ పై దాడి చేసిన దృశ్యాలు గుర్తు తెలియని వ్యక్తి షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ కావడంతో ఈ వీడియో ఆధారంగా దాడి చేసిన వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు.
అయితే ఆర్టీసీ డ్రైవర్ రామ్ సింగ్ పై దాడి చేసిన వారిలో ప్రధాన సూత్రదారి అయిన సుధీర్ పై కేసు నమోదు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. సుధీర్ పై ఇప్పటికే వున్న కేసులు వివరాలు చూసి షాక్ తిన్నారు పోలీసులు. దొంగ నోట్ల మార్పిడి, తక్కువ ధరకు బంగారు అమ్ముతామని ఆశ చూపి మోసం చేయడం తో పాటు కోట్ల రూపాయల మేర చీటింగ్ చేసినట్లు ఇప్పటికే కేసులు నమోదు కావడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఈ విషయమై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బందిపై దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్నామని.. ఇప్పటికే నిందితులపై పలు కేసులు ఉన్నాయని అయితే వీరికి అధికార పార్టీ కి ఎలాంటి సంబంధం లేదన్నారు. సుధీర్ అండ్ గ్యాంగ్ కావలి కేంద్రంగా చేస్తున్న అక్రమాలు, ఆకృత్యాలపై వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని అన్నిటినీ అరికడతామని అన్నారు. ఆర్టీసీ సిబ్బందిపై దౌర్జనానికి పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించమని.. తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..