తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40–50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు, వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి ,ఉత్తర అంతర ఒడిశా దానిని ఆనుకుని ఉన్న దక్షిణ జార్ఖండ్ & ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతూ ఈ రోజు, జూలై 29, 2026, ఉదయం 0830 గంటలకు ఛత్తీస్‌గఢ్ మధ్య భాగాలు, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర అంతర ఒడిశాపై, 21.9° ఉత్తర అక్షాంశం, 83.3° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది రాయ్‌గఢ్ (ఛత్తీస్‌గఢ్)కు పశ్చిమ-వాయువ్యంగా, చంపా (ఛత్తీస్‌గఢ్)కు తూర్పు-ఆగ్నేయంగా సుమారు 60 కిలోమీటర్ల దూరంలో, సంబల్‌పూర్ (ఒడిశా)కు వాయువ్యంగా 80 కిలోమీటర్ల దూరంలో, బిలాస్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)కు తూర్పున 120 కిలోమీటర్ల దూరంలో, రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)కు తూర్పు-ఈశాన్యంగా 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా దాదాపు పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో పాటు సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు శ్రీ గంగానగర్, భివానీ, గ్వాలియర్, సిద్ధి, ఛత్తీస్‌గఢ్ మధ్య భాగాలు, ఆనుకొని ఉన్న ఉత్తర అంతర్గత ఒడిశాపై ఏర్పడిన తీవ్ర వాయుగుండము కేంద్రం, పూరీల గుండా ప్రయాణిస్తూ, అక్కడి నుండి ఆగ్నేయంగా బంగాళాఖాతం మధ్య భాగాల వైపుగా ప్రయాణిస్తూ, సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. అంతేకాకుండా మధ్య భారతదేశం మీదుగా తూర్పు-పడమర దిశగా ఒక ‘షియర్ జోన్ లేదా గాలుల కొత సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తు వెళ్ళేకొలది దక్షిణ దిశగా వంగి ఉంటుంది.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం ;-
బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
బుధవారం, గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
రాయలసీమ:-
బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
