AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Mystery: కోడిగుడ్డు శాకాహారమా? మాంసాహారమా?.. ఏళ్ల నాటి ప్రశ్నకు సైన్స్ ఇస్తున్న పక్కా క్లారిటీ ఇదే!

కోడిగుడ్డు అనగానే మనలో చాలామందికి ఎదురయ్యే అతిపెద్ద సందేహం.. ఇది శాకాహారమా లేక మాంసాహారమా అని! గుడ్డును కోడి పెడుతుంది కాబట్టి అది మాంసాహారమే అని కొందరు వాదిస్తే.. కోడి మాంసంలాగా దీనిని చంపి తినడం లేదు కాబట్టి పాలు లాగా ఇది కూడా జంతువుల నుండి వచ్చే శాకాహారమే అని మరికొందరు చెబుతుంటారు.

Egg Mystery: కోడిగుడ్డు శాకాహారమా? మాంసాహారమా?.. ఏళ్ల నాటి ప్రశ్నకు సైన్స్ ఇస్తున్న పక్కా క్లారిటీ ఇదే!
Is Egg A Vegetarian Food,
Bhavani
|

Updated on: Jul 29, 2026 | 3:21 PM

Share

ఇక శాకాహారులు గుడ్డును తినడానికి ఆలోచిస్తే, ఎగ్‌టేరియన్స్ (ఎగ్ మాత్రమే తినే శాకాహారులు) మాత్రం ఇది పక్కా వెజ్ అని లాగించేస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ఈ వాదనపై సైన్స్ ఏం చెబుతోంది? అసలు మనం రోజూ తినే కోడిగుడ్డులో ప్రాణం ఉంటుందా? సైంటిస్టుల విశ్లేషణ ప్రకారం కోడిగుడ్డు వెజ్ ఆ? లేక నాన్-వెజ్ ఆ? అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం.

గుడ్లు ఎన్ని రకాలు?

శాస్త్రీయంగా గుడ్లను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

ఫెర్టిలైజ్డ్ గుడ్లు: కోడిపుంజుతో కోడిపెట్ట కలవడం వల్ల ఉత్పత్తి అయ్యే గుడ్లను ఫెర్టిలైజ్డ్ గుడ్లు అంటారు. వీటిలో జీవం ఉంటుంది, వీటి పొదిగితే కోడిపిల్లలు పుడతాయి. ఇవి మాంసాహారం కిందకే వస్తాయి.

అన్-ఫెర్టిలైజ్డ్ గుడ్లు: కోడిపుంజుతో కలవకుండానే, వయసు వచ్చిన కోడిపెట్ట సహజంగానే పెట్టే గుడ్లను అన్-ఫెర్టిలైజ్డ్ గుడ్లు అంటారు. మనం సూపర్ మార్కెట్లలో కొనే పౌల్ట్రీ గుడ్లన్నీ ఈ కోవకే చెందుతాయి.

కోడిగుడ్డు శాకాహారమేనా? (సైన్స్ ఏం చెబుతోంది?) మనం రోజూ తినే పౌల్ట్రీ గుడ్ల తయారీలో కోడిపుంజు పాత్ర ఉండదు కాబట్టి, ఆ గుడ్ల నుండి కోడిపిల్లలు పుట్టే అవకాశమే లేదు. అనగా, మనం తినే గుడ్లలో ఎలాంటి జీవం (ప్రాణం) ఉండదు. జంతువు లేదా పక్షిని చంపకుండా, కేవలం వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే పాలు లాంటిదే అన్-ఫెర్టిలైజ్డ్ గుడ్డు అని, కాబట్టి శాస్త్రీయంగా మార్కెట్ గుడ్లు ‘శాకాహారం’ కిందకే వస్తాయని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు.

ఎగ్ వైట్ (తెల్లసొన) పూర్తిగా వెజ్ గుడ్డులో మూడు భాగాలు ఉంటాయి. పైపొర , తెల్లసొన పచ్చసొన. ఇందులో తెల్లసొన పూర్తిగా నీరు మరియు ప్రోటీన్‌ల మిశ్రమం మాత్రమే. ఇందులో ఎలాంటి జంతు కణాలు ఉండవు. కాబట్టి ఎగ్ వైట్ అనేది వంద శాతం శాకాహారమే.

పచ్చసొన నాన్-వెజ్ ఆ? పచ్చసొనలో కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు అధిక ప్రోటీన్లు ఉంటాయి. ఫెర్టిలైజ్డ్ గుడ్లలో అయితే పచ్చసొనలోని కణాల నుండే కోడిపిల్ల ప్రాణం పోసుకుంటుంది కాబట్టి దానిని నాన్-వెజ్ అనొచ్చు. కానీ, మనం తినే అన్-ఫెర్టిలైజ్డ్ గుడ్లలోని పచ్చసొనలో పిండం లేదా జీవం ఏర్పడటానికి అవసరమైన కణాలు అభివృద్ధి చెందవు. కాబట్టి, సైన్స్ ప్రకారం పౌల్ట్రీ గుడ్డు పచ్చసొన కూడా మాంసాహారం కిందకు రాదు.

కోడి నుండి వచ్చినప్పటికీ, ప్రాణం లేని గుడ్లను (మార్కెట్లో దొరికేవి) తినడం వల్ల ఎవరి ప్రాణాన్ని తీయడం లేదు కాబట్టి వాటిని శాకాహారంగానే పరిగణించవచ్చు. పశువుల నుండి వచ్చే పాలను ఎలాగైతే శాకాహారంగా స్వీకరిస్తున్నామో, కోడి నుండి వచ్చే అన్-ఫెర్టిలైజ్డ్ గుడ్డును కూడా నిరభ్యంతరంగా తినవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. పైన పేర్కొన్న వివరాలు సైన్స్ విశ్లేషణలు మరియు నిపుణుల అభిప్రాయాల ప్రాతిపదికన అవగాహన కోసం మాత్రమే అందించబడ్డాయి. అహార నియమాలు మరియు నమ్మకాలు ఎవరి వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా వారిపై ఆధారపడి ఉంటాయి.

Follow Us
ఎగ్ తినేవారు నాన్ వెజిటేరియన్సా?.. శాస్త్రవేత్తలు చెబుతున్నదిదే
ఎగ్ తినేవారు నాన్ వెజిటేరియన్సా?.. శాస్త్రవేత్తలు చెబుతున్నదిదే
ఇది తాగితే ఒంట్లో నీరసం పోయి రాత్రికి రాత్రే ఉక్కులా మారతారు
ఇది తాగితే ఒంట్లో నీరసం పోయి రాత్రికి రాత్రే ఉక్కులా మారతారు
ఇక మధ్యాహ్న భోజనంలో 'చికెన్‌ బిర్యానీ'..? విద్యార్ధులు పండగే
ఇక మధ్యాహ్న భోజనంలో 'చికెన్‌ బిర్యానీ'..? విద్యార్ధులు పండగే
ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
4 గంటల్లోనే ఇంటికి గ్యాస్ డెలివరీ.. ఎక్స్‌ప్రెస్ వేగంతో సేవలు..
4 గంటల్లోనే ఇంటికి గ్యాస్ డెలివరీ.. ఎక్స్‌ప్రెస్ వేగంతో సేవలు..
ప్రపంచ నెంబర్ 1గా టీమిండియా ప్రిన్స్.. కోహ్లీకి పొంచిఉన్న ప్రమాదం
ప్రపంచ నెంబర్ 1గా టీమిండియా ప్రిన్స్.. కోహ్లీకి పొంచిఉన్న ప్రమాదం
క్యాటరింగ్ స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే..?
క్యాటరింగ్ స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే..?
విద్యార్ధులకు అలర్ట్.. తెలంగాణ SET 2026 నోటిఫికేషన్ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. తెలంగాణ SET 2026 నోటిఫికేషన్ వచ్చేసింది!
కాళ్ల నొప్పి, తిమ్మిరికి ఈ ఒక్క చెంచా చాలు.. పూర్తి రిలీఫ్
కాళ్ల నొప్పి, తిమ్మిరికి ఈ ఒక్క చెంచా చాలు.. పూర్తి రిలీఫ్
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎందుకు..? వామ్మో.. ఆర్బీఐ ప్లాన్ చూస్తే
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎందుకు..? వామ్మో.. ఆర్బీఐ ప్లాన్ చూస్తే