AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై కేవలం 4 గంటల్లోనే ఇంటికి డెలివరీ.. ఎక్స్‌ప్రెస్ వేగంతో..

గ్యాస్ సిలిండర్ల కోసం ఇక నుంచి రోజుల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం 4 గంటల్లోనే సిలిండర్ ఇంటికి డోర్ డెలివరీ అవ్వనుంది. ఈ మేరకు త్వరలో 4 గంటల ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇది ఇలా పనిచేస్తుందంటే..?

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై కేవలం 4 గంటల్లోనే ఇంటికి డెలివరీ.. ఎక్స్‌ప్రెస్ వేగంతో..
Gas Cylinder
Venkatrao Lella
|

Updated on: Jul 29, 2026 | 3:10 PM

Share

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోగానే.. రెండు, మూడు రోజుల్లో డోర్ డెలివరీ అవుతుంది. కొన్ని సమయాల్లో వారం రోజుల సమయం కూడా పట్టవచ్చు. అయితే ఇక నుంచి అన్ని రోజుల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం 4 గంటల్లోనే సిలిండర్ ఇంటికి డెలివరీ చేస్తారు. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక ముందడుగు వేసింది. ఇండేన్ ఎక్స్‌టా లైట్ నౌ అనే కొత్త ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను త్వరలో పైలట్ ప్రాజెక్టుగా కొన్ని నగరాల్లో తీసుకురాన్నట్లు ప్రకటించింది. ఈ నగరాల్లో ఎక్స్‌ప్రెస్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నవారికి నాలుగు గంటల్లోనే సిలిండర్ డోర్ డెలివరీ చేయనుంది.

4 గంటల్లోనే డెలివరీ ఎలా..?

ప్రస్తుతం ఉన్న ఇనుప సిలిండర్ల స్థానంలో అత్యాధునిక కాంపోజిట్ సామాగ్రితో తయారుచేసిన 10 కేజీలు, 5 కేజీల సిలిండర్లను తీసుకురానున్నారు. వీటి బరువు చాలా తక్కువగా ఉంటుంది. దీంతో వీటిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. అంతేకాకుండా ఇనుప సిలిండర్ల తరహాలోనే ఇవి వెంటనే తప్పు పట్టవు. ఇదేకాక మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందనేది సులువుగా తెలుసుకోవచ్చు. ట్రాన్స్‌పరేట్ డిజైన్‌తో సిలిండర్ బాడీ ఉండటం వల్ల గ్యాస్ ఎంత ఉందనేది మీ కంటికి కనిపిస్తూ ఉంటుంది. దీని వల్ల గ్యాస్ అక్రమాలకు కూడా చెక్ పెట్టినట్లు అవుతుంది. కొన్నిసార్లు తక్కువ గ్యాస్ నింపి ఇవ్వడం లాంటి మోసాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కొత్త గ్యాస్ సిలిండర్ల వల్ల అలాంటివి కుదరవు.

తొలుతగా ఈ నగరాల్లో..

తొలి విడతలో భాగంగా కోయంబత్తూర్, పుణె, గురుగ్రామ్, ఇండోర్ లాంటి నగరాల్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ఆగస్ట్ నాటికి 25 సిటీలు, అక్టోబర్ నాటికి దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. 10 కేజీలు, 5 కేజీల సిలిండర్లను ఎక్స్‌ప్రెస్ డెలివరీ జాబితాలో చేర్చనున్నారు. బుక్ చేసిన 4 గంటల్లోనే వీటిని డెలివరీ చేస్తారు. అలాగే గ్యాస్ రీఫిల్లింగ్, కొత్త కనెక్షన్ తీసుకోవాలన్నా చాలా సులువు. ఇండియన్ ఆయిల్ వన్ యాప్ లేదా కస్టమర్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. 7588888824 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా 4 గంటల ఎక్స్‌ప్రెస్ డెలివరీ సదుపాయం పొందచ్చు.

Follow Us
తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు : ఎల్‌నినో ప్రభావమా?
తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు : ఎల్‌నినో ప్రభావమా?
ఐస్‌క్రీమ్ తిన్నాక గొంతు నొప్పి వేధిస్తోందా, జలుబా?..
ఐస్‌క్రీమ్ తిన్నాక గొంతు నొప్పి వేధిస్తోందా, జలుబా?..
అరుదైన వృక్ష జాతి మొక్కకు నామకరణం చేసిన పవన్ కల్యాణ్..
అరుదైన వృక్ష జాతి మొక్కకు నామకరణం చేసిన పవన్ కల్యాణ్..
చైనా హ్యూమనాయిడ్ రోబోలపై USA బ్యాన్.. మరింత ముదురుతున్న యవ్వారం
చైనా హ్యూమనాయిడ్ రోబోలపై USA బ్యాన్.. మరింత ముదురుతున్న యవ్వారం
వర్షాకాలంలో ఐ డ్రాప్స్ ఇలా వాడితే చూపు కోల్పోతారు జాగ్రత్త!
వర్షాకాలంలో ఐ డ్రాప్స్ ఇలా వాడితే చూపు కోల్పోతారు జాగ్రత్త!
పీఎఫ్ అకౌంట్లో వడ్డీ జమ కాలేదా..? ఏం చేయాలంటే..?
పీఎఫ్ అకౌంట్లో వడ్డీ జమ కాలేదా..? ఏం చేయాలంటే..?
నోరూరించే లీచీ పండ్లు కొనేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!..
నోరూరించే లీచీ పండ్లు కొనేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!..
మనోళ్లు దొరికిపోతున్నారయ్యా.. ఇకనైనా అవి జరపాల్సిందే..
మనోళ్లు దొరికిపోతున్నారయ్యా.. ఇకనైనా అవి జరపాల్సిందే..
6 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లి ఒడికి బిడ్డ
6 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లి ఒడికి బిడ్డ
చోర పంచకం ఎప్పుడు..? ఈ రోజుల్లో డబ్బు, వ్యాపార విషయాల్లో ఎందుకు..
చోర పంచకం ఎప్పుడు..? ఈ రోజుల్లో డబ్బు, వ్యాపార విషయాల్లో ఎందుకు..