AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి ఇదే లాస్ట్ ఛాన్స్.. మూడ్రోజులే టైమ్.. ఈ పని చేయకపోతే కార్డు కట్..

తెలంగాణలో రేషన్ కార్డు ఉందా..? రేషన్ కార్డులో మీ పేరు ఉందా..? అయితే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలి. కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ మూడ్రోజుల్లో పూర్తి చేయకపోతే మీరు కార్డును కోల్పోయే ప్రమాదముంది. దీంతో రేషన్ అందుకోలేరు.

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి ఇదే లాస్ట్ ఛాన్స్.. మూడ్రోజులే టైమ్.. ఈ పని చేయకపోతే కార్డు కట్..
Ration Card
Venkatrao Lella
|

Updated on: Jul 29, 2026 | 3:35 PM

Share

తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్. రేషన్ కార్డు ఉన్నవారు ఈకేవైసీ పూర్తి చేయడానికి కేవలం మూడు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కార్డు ఇనాక్టివ్ అయిపోవడం వల్ల రేషన్ సరుకులు తీసుకోలేరు. ఇ-కేవైసీ(e-KYC) ధృవీకరణను పూర్తి చేయడానికి ఈ నెల 31వ తేదీ వరకు రేవంత్ సర్కార్ గడువు ఇచ్చింది. అంటే కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అప్పటిలోగా పూర్తి చేయకపోతే మీ కార్డు, నెలవారీ సరుకులను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికీ చాలామంది కేవైసీ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో ప్రతీఒక్కరూ గడువులోకా పూర్తి చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియను సింపుల్‌గా ఎక్కడైనా పూర్తి చేయవచ్చు.

జులై 31లోగా పూర్తి చేయాల్సిందే..

కేవైసీ పూర్తి చేసేందుకు మీరు మీ సొంత ఊరికి తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. బయోమెట్రిక్ లేదా ఐరిస్ స్కానింగ్ కోసం మీ ఒరిజినల్ ఆధార్ కార్డుతో సమీపంలోని ఏదైనా రేషన్ షాపుకు లేదా మీసేవా కేంద్రానికి వెళితే సరిపోతుంది. ఈ ప్రక్రియ కోసం ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా కంప్లీట్ చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతీ లబ్దిదారుడు ఈ ప్రాసెస్ పూర్తి చేయాలి. 8 ఏళ్లుపైబడిన ప్రతీఒక్కరూ తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలి. జులై 31లోగా పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు నిలిచిపోతాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం త్వరలో పంపిణీ చేయనున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కూడా అందదు.

ఆగస్ట్ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు

ఆగస్ట్ నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 1.05 కోట్ల కుటుంబాలకు వీటిని అందించనుంది. వీటిల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇప్పటికే వీటి ప్రింటింగ్ పూర్తవ్వగా.. అన్ని జిల్లాలకు పంపించారు. ఆగస్ట్ 1 లేదా ఆగస్ట్ 15 నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించనుండగా.. తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందించనున్నారు. ఈ స్మార్ట్ కార్డులపై రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటో ఉంటుంది. జులై 31లోగా ఈకేవైసీ పూర్తి చేయనివారికి ఇవి అందవని స్పష్టం చేసింది. ఇంకా 5 లక్షల మంది రేషన్ లబ్దిదారులు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. జులై 31కల్లా 100 శాతం ఈకేవైసీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వ యంత్రాగం ఆదేశాలు జారీ చేసింది. రేషన్ షాపులు, ప్రత్యేక శిబిరాల ద్వారా పూర్తి చేయాలని సూచించింది.

Follow Us