Kesineni Nani: రాజీనామాపై స్పందించిన ఎంపీ కేశినేని నాని.. త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటానని స్పష్టం..
విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. ఎంపీ పదవితో పాటూ టీడీపీకి రాజీనామా చేస్తానని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 'అందరికి నమస్కారం.. చంద్రబాబు నాయుడు గారు తెలుగు దేశం పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి గౌరవ లోకసభ స్పీకర్ గారిని కలిసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమెదింప చేయించుకుని ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియచేస్తున్నాను.

విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. ఎంపీ పదవితో పాటూ టీడీపీకి రాజీనామా చేస్తానని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘అందరికి నమస్కారం.. చంద్రబాబు నాయుడు గారు తెలుగు దేశం పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి గౌరవ లోకసభ స్పీకర్ గారిని కలిసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమెదింప చేయించుకుని ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియచేస్తున్నాను’అంటూ తన నిర్ణయాన్ని ఎక్స్ (ట్విట్టర్) లో ప్రకటించారు.
టీడీపీలో గత కొన్ని రోజులుగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారంపై తీవ్ర చర్చ నడిచింది. మొన్న తిరువూరు సభ విషయంలో కేశినేని బ్రదర్స్ మధ్య మొదలైన పొలిటికల్ వార్.. మరింత ముదిరింది. చంద్రబాబు ఆదేశాలతో తనను టీడీపీ నేతలు కలిశారని.. తిరువూరు సభకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలలో దూరంగా ఉండమని చెప్పినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు కేశినేని నాని. అలాగే వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు వేరొకరికి ఇవ్వబోతున్నట్లు తనతో చర్చించింన విషయాన్ని వెల్లడించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని పార్టీ నేతలు తనతో చెప్పినట్లు వివరించారు. ఈ పరిణామాలనంతరం కేశినేని నాని స్పందిస్తూ అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానన్నారు. రామభక్త హనుమాన్ లాగా చంద్రబాబు చెప్పినట్లే నడుచుకుంటానంటూ నాని మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు.
తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని ప్రకటించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండిపెండెంట్‌గా అయినా సరే పోటీ చేస్తానన్నారు. ఈసారి గెలిచి హ్యట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుని ఫిబ్రవరిలో ప్రకటిస్తానన్నారు. రాజకీయంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఎంపీగా తనకు ఉన్న ప్రోటోకాల్ ప్రకారం వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొన్నానన్నారు. ఇంతటితో ఆగకుండా చంద్రబాబును హిట్లర్‌తో పోలుస్తూ వ్యంగాస్త్రాలు సంధించారు. బాస్ ఏం చెప్తే అదే కరెక్ట్ అంటూ చురకలు అంటించారు. దీనికి ఉదాహరణంగా జర్మనీ నాశనం అయ్యే వరకు హిట్లర్ కూడా కరెక్టే అంటూ కౌంటర్ ఎటాక్ చేశారు. గత కొన్నేళ్లుగా పార్టీలో ముఖ్య నాయకుడుగా ఉన్న కేశినేని నాని చివరి నిమిషంలో దూకుడుగా వ్యవహరించి ముందుగా ఎంపీ పదవికి, ఆతరువాత పార్టీకి కూడా గుడ్ బై చెబుతున్నట్లు కీలక ప్రకటన చేశారు.
చంద్రబాబు నాయుడు గారు పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను . pic.twitter.com/dFq85E4SxG
— Kesineni Nani (@kesineni_nani) January 5, 2024
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..