Srikalahasti: శ్రీకాళహస్తి గుడిలో అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగ్… తెరిచి చూడగా..
ప్రజంట్ సమాజం ఎలా ఉందో చూస్తున్నాం. చుట్టూరా మోసాలే. ఆదమరిస్తే అంతే సంగతులు.

ప్రజంట్ సమాజం ఎలా ఉందో చూస్తున్నాం. చుట్టూరా మోసాలే. ఆదమరిస్తే అంతే సంగతులు. డబ్బు విషయంలో బాగా తెలిసినవారు కూడా మోసాలు చేస్తోన్న ఘటనలు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అయితే శ్రీకాళహస్తిలోని ఓ సెక్యూరిటీ గార్డ్ నిజాయితీ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంకు చెందిన సంతోష్ రెడ్డి శ్రీకాళహస్తీశ్వరుడ్ని దర్శించుకునేందుకు బుధవారం ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వచ్చారు. గుడిలోకి వెళ్లి స్వామి, అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చేశారు. ఈ క్రమంలో తమతో తీసుకొచ్చిన బ్యాగ్ కనిపించకపోవడంతో షాక్ తిన్నారు. ఆ బ్యాగ్ ఎక్కడ మిస్ అయ్యిందో వారికి అర్థం కాలేదు. గుడిలోకి వెళ్లేటప్పుడు బ్యాగ్ వారితోనే ఉంది.. కానీ ఎక్కడ కనిపించకుండా పోయిందో గుర్తుకురాలేదు. ఈ క్రమంలో ఆ బ్యాగ్ గుడిలోని సెక్యూరిటీ గార్డ్ బత్తెయ్యకు తారసపడింది. వెంటనే అతడు అక్కడికి వెళ్లి.. కాస్త భయంతోనే బ్యాగ్ ఓపెన్ చేశాడు. లోపల డబ్బుతో పాటు ఇతర వస్తువులు ఉన్నాయి. దీంతో వెంటనే ఆ బ్యాగును అక్కడే ఉన్న భద్రతా సిబ్బందికి అప్పగించారు.
వారు బ్యాగును పొగొట్టుకున్న సంతోష్ రెడ్డికి అప్పగించారు. ఆ బ్యాగులో రూ.11వేల నగదు, ఏటీఎం కార్డు ఉన్నాయి. ఆ వివరాల మేరకు సంతోష్‌రెడ్డికి బ్యాగ్‌ను ఇచ్చారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకునే క్రమంలో వెంట తెచ్చిన బ్యాగ్‌ను ఆలయంలో మర్చిపోయినట్లు సంతోష్ రెడ్డి వారికి తెలిపాడు. బ్యాగ్‌ను తిరిగిచ్చిన సెక్యూరిటీ గార్డ్ బత్తెయ్యకు సంతోష్ రెడ్డి థ్యాంక్స్ చెప్పాడు. అధికారులు కూడా అతడి నిజాయితీని మెచ్చుకున్నారు.
Also Read: అయ్యో పాపం యాక్సిడెంట్ అనుకోకండి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్
పెళ్లి చూపుల్లో అబ్బాయి నచ్చలేదని చెప్పిన యువతి.. అతడు చేసిన పని కనీసం మీరు ఊహించలేరు