Sajjala Ramakrishna Reddy: అక్రమాలకు చిరునామాగా ఆయన నివాసం.. దేశంలో జరిగిన అతిపెద్ద స్కాం అమరావతి..
అసెంబ్లీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణసీకారోత్సవ కార్యక్రమం అనంతరం ఈమేరకు మాట్లాడారు. అక్రమాలకు చిరునామా చంద్రబాబు కరకట్ట నివాసం. ప్రభుత్వానికిచ్చి ఉంటే చంద్రబాబు ఆ నివాసాన్ని ఖాళీ చేసి ఉండాలి. లేదంటే చంద్రబాబు ప్రతిపక్షనేత నేత నివాసంగానైనా మార్చుకోవాలి.

చంద్రబాబు హయాంలో దేశంలో జరిగిన అతిపెద్ద స్కాం అమరావతి అని మండిపడ్డారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. అసెంబ్లీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణసీకారోత్సవ కార్యక్రమం అనంతరం ఈమేరకు మాట్లాడారు. అక్రమాలకు చిరునామా చంద్రబాబు కరకట్ట నివాసం. ప్రభుత్వానికిచ్చి ఉంటే చంద్రబాబు ఆ నివాసాన్ని ఖాళీ చేసి ఉండాలి. లేదంటే చంద్రబాబు ప్రతిపక్షనేత నేత నివాసంగానైనా మార్చుకోవాలి. లింగమనేని రమేష్‌కి, హెరిటేజ్‌కి మధ్య లావాదేవీలు జరిగాయి. చంద్రబాబు బరితెగింపుకి నిదర్శనం ఈ అక్రమ నివాసం అని విమర్శించారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చట్టం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవ చేశారు.
డబ్బున్న వాళ్లకోసం పేదలకు ఇవ్వకుండా చేశారు. రియల్‌ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా చంద్రబాబు గొడవ చేయిస్తున్నారని సజ్జల అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని సజ్జల ఫైర్ అయ్యారు. అక్రమాలకు చిరునామాగా చంద్రబాబు ఉన్న అక్రమ నివాసం కనిపిస్తుందన్నారు సజ్జల. లింగమనేని రమేష్‌కు ఒక్క రూపాయి రెంట్ పే చేయలేదని.. ఏ హోదాతో చంద్రబాబు అక్కడ ఉన్నారో తెలియదన్నారు.
దేశభక్తితో నా హౌస్ ప్రభుత్వానికి ఇచ్చానని లింగమనేని కోర్టులో చెప్పారు. చంద్రబాబు సీఎం పదవి పూర్తయ్యాక ఎందుకు ఖాళీ చేయలేదని ఆయన ప్రశ్నించారు. గెస్ట్ హౌస్ కోసం లింగమనేని రమేష్ కోసం రైతుల భూమి ఇచ్చారని అన్నారు. సీఎం జగన్ రాజకీయ నిర్ణయాలు చంద్రబాబుకు రాజకీయంగా ఉరితాడు లాంటివని అన్నారు. అందుకే తోడేళ్ల మందలా ఏకమై దాడి చేయాలని చూస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి నిప్పులు చెరిగారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం
