Tiger Tension: విజయనగరవాసులను వణికిస్తున్న బెంగాల్ టైగర్.. గ్రామాల చుట్టూ కావలా కాస్తున్న గ్రామస్థులు

గత కొన్ని నెలలుగా విజయనగరం జిల్లావాసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పులి సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు.. ఏ క్షణాన ఏమి జరుగుతుందో అని హడలెత్తిపోతున్నారు..

Tiger Tension: విజయనగరవాసులను వణికిస్తున్న బెంగాల్ టైగర్.. గ్రామాల చుట్టూ కావలా కాస్తున్న గ్రామస్థులు
Tiger Tension
Follow us
Surya Kala

|

Updated on: Feb 25, 2023 | 6:39 AM

విజయనగరం జిల్లాలో మరోసారి రాయల్ బెంగాల్ టైగర్ వణికిస్తుoది .. ఎప్పుడు ఎవరి పై దాడి చేసి ప్రాణాలు తీస్తుందో అని హడలిపోతున్నారు.. పులి భయంతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు పలు గ్రామాల ప్రజలు.. రాత్రింబవళ్లు గ్రామాల చుట్టూ పహారా కాసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు.. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి పులిని బంధించేందుకు కావాల్సిన చర్యలు చేపడుతున్నా ప్రజల్లో మాత్రం భయానక పరిస్థితులు ఏ మాత్రం తగ్గటం లేదు.

గత కొన్ని నెలలుగా విజయనగరం జిల్లావాసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పులి సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు.. ఏ క్షణాన ఏమి జరుగుతుందో అని హడలెత్తిపోతున్నారు.. పెద్దపులి తమ ఆవుల పై దాడి చేసి హతమారుస్తుంటే ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు రైతులు. పులి కనిపించిందంటూ స్థానికులు చెప్తున్న గుర్తులు, పులి ఆనవాళ్లు అందరినీ కలవరానికి గురిచేస్తున్నాయి.. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న భయానక పరిస్థితులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం ఉండటం లేదు. ఇప్పుడు మెంటాడ మండలం లోని మల్యాడవలస లో పులి దాడిచేసి రెండు ఆవులను హతమార్చడం స్థానికులకు మరింత ఆందోళనకు గురిచేసింది. మల్యాడ వలసతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తమ ఆవులను కాపాడుకోవడానికి తీవ్రమైన కసరత్తే చేయాల్సి వస్తుంది.

పులి దాడిలో ఆవులు మృతి చెందిన విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగి పులి సంచరించిన ప్రాంతానికి వెళ్లారు.. అక్కడ సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు.. ఆ కెమెరాల్లో రాయల్ బెంగాల్ టైగర్ కనిపించడంతో గతంలో జిల్లాలో సంచరించిన పులి కొంతకాలం తరువాత మరోసారి జిల్లాలోకి ప్రవేశించిందనే అభిప్రాయానికి వచ్చారు. కాలి ముద్రలు సేకరించారు. ముద్రల కొలతలు తీసుకున్నారు. కాలి ముద్రల ఆధారంగా సమీపంలో ఉన్న కొండ ప్రాంతంలో పులి ఉన్నట్లు తేల్చారు.. ఆహారం, త్రాగునీటి కోసం మైదాన ప్రాంతంకి వచ్చినట్లు భావిస్తున్నారు.. ప్రాధమికంగా దొరికిన ఆనవాళ్ళతో చర్యలకు దిగుతున్నారు అధికారులు. పెద్ద పులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.. అందుకోసం గ్రామగ్రామాన తిరిగి దండోరా వేయిస్తున్నారు. మరోవైపు చుట్టుపక్కల గ్రామాల వారు మాత్రం తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు.. రాత్రిళ్ళు గ్రామంలో పహారా కాస్తూ కాలం గడుపుతున్నారు.. ఎప్పుడు తమ వారి పై పులి దాడి చేస్తుందో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.. ఏది ఏమైనా వెంటనే పులిని బంధించి తమ ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు జిల్లావాసులు.

Reporter: Koteswara rao

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!