Red Gram: కొండెక్కిన కందిపప్పు రేటు.. ఇప్పుడు కేజీ ఎంతో తెల్సా..?

ఏపీలోని చాలా కిరాణ షాపుల్లో కందిపప్పు నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా కృత్రిమ కొరతా.. వ్యాపారుల ట్రిక్కా అంటే.. దిగుబడే తక్కువగా ఉంది కాబట్టి..ఇది ఎవరి ట్రిక్కూ కాదని తెలుస్తోంది.. కందిపప్పు కొరత మున్ముందు మరింత భయపెట్టనుంది.

Red Gram: కొండెక్కిన కందిపప్పు రేటు.. ఇప్పుడు కేజీ ఎంతో తెల్సా..?
Red Gram
Follow us

|

Updated on: May 21, 2023 | 1:14 PM

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. రేట్లు పెరిగిపోయె.. కిరాణ కొట్టుకు వెళ్తే సరుకులు రాకపోయే.. ఓవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు మార్కెట్లో పెరుగుతున్న నిత్యావసరాల రేట్లతో సామాన్యుడు అల్లాడిపోతున్నారు. కిరాణా షాపులో ఏవస్తువు ముట్టుకున్నా రేట్లు మండిపోతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా కందిపప్పు రేటు కూడా కొండెక్కింది. నిన్న మొన్నటి వరకు నూనెల ధరలతో అల్లాడిన సామాన్యులను ఇప్పుడు కందిపప్పు భయపెడుతోంది.

పప్పు లేకుండా అన్నం తినగలమా.. కంచంలో ఎన్ని ఉన్నా పప్పు లేకపోతే దిక్కు తోచదు.. ఏదో వెలితి..మరి ఆ పప్పు అస్సలు దొరకనంటోంది. డిమాండ్‌కు సరిపడా కందిపప్పు అందుబాటులో లేకపోవడంతో సూపర్ మార్కెట్లు సహా కిరాణా దుకాణాల్లోనూ నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కాస్తోకూస్తో ఉన్న కందిపప్పును అధిక ధరలకు అమ్ముకుంటూ వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటైల్ మార్కెట్లో ప్రస్తుతం 140కి పెరిగిన ధర 180 రూపాయల వరకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. డబుల్ సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

గతేడాది దేశంలో 43.4 లక్షల టన్నుల కందిపప్పును పండించగా, మరో 15 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నారు. అయితే, ఈ ఏడాది మాత్రం దిగుబడి 38.9 లక్షల టన్నులు దాటలేదు. దీనికి తోడు దిగుమతి విషయంలోనూ కేంద్రం అలసత్వం చేసిందన్న ఆరోపణలున్నాయి. దీంతో, క్వింటాల్ కందిపప్పుకు కేంద్రం 6,600 కనీస మద్దతు ధర ప్రకటించింది. కానీ ప్రస్తుతం క్వింటాల్ కందిపప్పు రూ. 10 నుంచి రూ. 12 వేలు పలుకుతోంది. రెండు నెలల క్రితం కిలో కందిపప్పు 100 రూపాయలు ఉండేది. ప్రస్తుతం కిలో కందిపప్పు ధర 140కి చేరింది. మున్ముందు 180 వరకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ, విశాఖ, తిరుపతిలో కందిపప్పు కొరత ఉంది. డిమాండ్‌కు సరిపడా లేకపోతే ధరలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..  

మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ కాలేయ క్యాన్సర్‌కు కారణమా?
మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ కాలేయ క్యాన్సర్‌కు కారణమా?
Weekly Horoscope: వ్యక్తిగత సమస్యల నుంచి ఆ రాశి వారికి ఊరట..
Weekly Horoscope: వ్యక్తిగత సమస్యల నుంచి ఆ రాశి వారికి ఊరట..
మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే బరువుగా అనిపిస్తుందా? కారణం ఏంటంటే..
మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే బరువుగా అనిపిస్తుందా? కారణం ఏంటంటే..
పోహా ఫింగర్స్.. చికెన్‌ని కూడా డామినేట్ చేస్తాయి..
పోహా ఫింగర్స్.. చికెన్‌ని కూడా డామినేట్ చేస్తాయి..
మార్కెట్లో తాజాగా ఉండే చేపలను ఎలా కనిపెట్టాలంటే..
మార్కెట్లో తాజాగా ఉండే చేపలను ఎలా కనిపెట్టాలంటే..
చీరకట్టులో తళుక్కుమన్న రాకింగ్ స్టార్ భార్య.. లేటెస్ట్ ఫొటోస్
చీరకట్టులో తళుక్కుమన్న రాకింగ్ స్టార్ భార్య.. లేటెస్ట్ ఫొటోస్
ధన్‌తేరస్‌కు 10 రోజుల ముందు రికార్డు స్థాయిలో బంగారం ధరలు..
ధన్‌తేరస్‌కు 10 రోజుల ముందు రికార్డు స్థాయిలో బంగారం ధరలు..
మీ బ్రెయిన్ స్పీడుగా పని చేయాలంటే.. ఇవి తింటే సరిపోతుంది..
మీ బ్రెయిన్ స్పీడుగా పని చేయాలంటే.. ఇవి తింటే సరిపోతుంది..
రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తింటే మందులతో పనే ఉండదు..
రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తింటే మందులతో పనే ఉండదు..
టాటా స్టీల్‌ను కాపాడేందుకు తన ఉద్యోగాన్ని వదులుకున్న రతన్‌ టాటా
టాటా స్టీల్‌ను కాపాడేందుకు తన ఉద్యోగాన్ని వదులుకున్న రతన్‌ టాటా