Rare Jumping Spider: ఇంద్రధనస్సు వర్ణాలు, 8 కళ్ళతో ప్రపంచంలో ఎనిమిదవ వింతగా ఖ్యాతిగాంచిన సాలీడు దర్శనం

Rare Jumping Spider: అంతరించి పోయాయి అనుకున్న అరుదైన కళాకండాలు, కొన్ని జీవులు మనకు కనిపించి ఆశ్చర్య పరుస్తుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని యోగివేమన యూనివర్శిటీ బొటానికల్ గార్డెన్లో..

Rare Jumping Spider: ఇంద్రధనస్సు వర్ణాలు, 8 కళ్ళతో ప్రపంచంలో ఎనిమిదవ వింతగా ఖ్యాతిగాంచిన సాలీడు దర్శనం
Jumping Spider
Follow us
Surya Kala

|

Updated on: Jul 07, 2021 | 7:20 PM

Rare Jumping Spider: అంతరించి పోయాయి అనుకున్న అరుదైన కళాకండాలు, కొన్ని జీవులు మనకు కనిపించి ఆశ్చర్య పరుస్తుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని యోగివేమన యూనివర్శిటీ బొటానికల్ గార్డెన్లో జంపింగ్ స్పైడర్ కనిపించింది. దీనిని చూసిన వారు ప్రపంచంలోనే ఎనిమిదవ వింత అని అంటున్నారు. ఎందుకంటే ఈ సాలీడు ఇంద్రధనస్సుని తలపించే రంగులతో కనువిందు చేస్తుంది. ఈ జంపింగ్ సాలీడు ప్రత్యేక ఏమిటో తెలుసుకుందాం..

అరుదైన సాలెపురుగు జాతి కీటకం ఈ జంపింగ్ సాలీడు. అప్పుడెప్పుడో 1868 సంవత్సరానికి ముందు జీవించి.. కాలక్రమంలో అంతరించి పోవడంతో అరుదైన సాలెపురుగు జాతి కీటకంగా మారిపోయింది. తాజాగా యోగివేమన విశ్వవిద్యాలయంలోని బొటానికల్‌ గార్డెన్‌ లో కనిపించడం తో నిపుణులు షాక్ తిన్నారు.

ఈ సాలీడు ఇంద్రధనస్సు వలే సప్తవర్ణశోభితంగా కనువిందు చేస్తోంది. ఈ కీటకాలు భారతదేశంలోని కేరళ వంటి ప్రాంతంలో 1868 సంవత్సరానికి ముందు ఎక్కువగా ఉండేవట. అయితే ఆ తరువాత కాలంలోజంపింగ్ స్పైడర్ల ఉనికి లేకుండా పోయింది. షడన్ ఈ జాతి అంతరించి పోయిందని పరిశోధకులు చెబుతున్నారు. మళ్లీ 2018 లో కేరళలో హఠాత్తుగా ఈ జంపింగ్ స్పైడర్ కనిపించింది కనుమరుగైపోయింది. తర్వాత ఇప్పుడు యోగివేమన యూనివర్సిటీలోని బొటానికల్ గార్డెన్లో జంపింగ్ స్పైడర్ ను గుర్తించారు. ఈ కీటకం సాల్టిసిడే కుటుంబానికి చెందినదని.. వీటిలో 600 లకుపైగా రకాలు ఉన్నాయని వృక్షశాస్త్రం అధ్యాపకులు చెబుతున్నారు. ఇవి తిరిగి కనిపించడం పై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ప్రపంచంలో ఎనిమిదవ వింతగా ఖ్యాతిగాంచిన ఈ జంపింగ్ స్పైడర్స్ తల పొడవుగా ఉంటుంది, ఛాతీలో చిన్న గాడితో విభజించబడి ఉంది. ఇవి 60 సెంటీమీటర్లు దూకగలడు.. గాజు మీద క్రాల్ చేయగలదు. అంతేకాదు సాధారణ సాలీడుల కంటే సామర్థ్యానికి మించి ఈ సాలీడులు పనులు చేయగలవని తెలిపారు. ఇక వీటి చూపు కూడా చాలా ప్రత్యేకమైనదని.. మిగిలిన జంతువులు చూడలేని దూరాన్ని కూడా ఇవి చూస్తాయని.. చీకటి లో సైతం వీటి చూపు అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు. ఇక వీటికి ఎనిమిది కళ్ళు ఉంటాయని.. అవి మిగిలిన కీటకాలతో పోలిస్తే.. పెద్దగా ఉండి… మూడు వరసలో అమర్చబడి ఉంటాయని తెలిపారు..దీని కళ్ళు ఇంద్రధనస్సు వంటి వళ్లు ఈ జంపింగ్ సాలీడు ప్రత్యేకత అంటున్నారు. ఈ వింత సాలీడును చూసేందుకు జనం బారులు తీరుతున్నారు.

Also Read: గడ్డిని తినడంలో గున్న ఏనుగు నేర్పు.. తినే ఆహారాన్ని ఎంచుకోవడం కూడా ఒక కళే అంటున్న నెటిజన్లు