Viral Video: గడ్డిని తినడంలో గున్న ఏనుగు నేర్పు.. తినే ఆహారాన్ని ఎంచుకోవడం కూడా ఒక కళే అంటున్న నెటిజన్లు

Baby Elephant Viral Video: లోకో భిన్న రుచి అన్నారు పెద్దలు. తినే ఆహారం రకరకాలుగా వండడాన్ని పాక శాస్త్రంగా ఒక కళ గా అభివర్ణిస్తే.. ఆ తినే ఆహారాన్ని ఎంచుకోవడం కూడా ఓ కళే అంటున్నారు నెటిజన్లు..

Viral Video: గడ్డిని తినడంలో గున్న ఏనుగు నేర్పు.. తినే ఆహారాన్ని ఎంచుకోవడం కూడా ఒక కళే అంటున్న నెటిజన్లు
Baby Elephant
Follow us
Surya Kala

|

Updated on: Jul 07, 2021 | 7:05 PM

Baby Elephant Viral Video: లోకో భిన్న రుచి అన్నారు పెద్దలు. తినే ఆహారం రకరకాలుగా వండడాన్ని పాక శాస్త్రంగా ఒక కళ గా అభివర్ణిస్తే.. ఆ తినే ఆహారాన్ని ఎంచుకోవడం కూడా ఓ కళే అంటున్నారు నెటిజన్లు.. ఈ గున్న ఏనుగు ఆహారం ఎంచుకోవడానికి చూపిస్తున్న నేర్పుని చూసి.. వివరాల్లోకి వెళ్తే..

ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ తాజాగా మరో అందమైన ఆహ్లాదకరైమైన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ గున్న ఏనుగు ఆహారం తినడానికి పడుతున్న తిప్పలు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కోతి చేష్టల తర్వాత అంతగా ఆకట్టుకునేవి గున్న ఏనుగు పనులే.. గున్న ఏనుగు ఏమి చేసినా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ బుజ్జి గున్న ఏనుగు మేత కోసం గడ్డిని ఎంచుకునే కళను అభ్యసిస్తుంది. వయ్యారంగా నడుస్తూ.. అంతకంటే వయ్యారంగా తోకను అటు ఇటు తిప్పుతూ.. గడ్డిని తన తొండంతో తీసుకుంటుంది.. నచ్చిన గడ్డిని నోట్లో పెట్టుకుంటుంది లేదంటే.. ఆ గడ్డిని అవతలకి విసిరి పడేస్తుంది. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది.

ఏనుగు ఎంత అందంగా ఉందో అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ఈ ఏనుగు గౌర్మండ్ల జాతికి చెందినవని .. ఇవి మంచి ఆహారం తినడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాయని అందుకనే తాను తినే సరైన గడ్డిని అన్వేషిస్తుందని ఒక ట్విట్టర్ యూజర్ తెలిపాడు.. గున్న ఏనుగు ఆహారం తినే స్టైల్ నిజంగా అద్భుతం .. అందంగా ఉంది.. వీడియో చూస్తుంటే చాలా సంతోషం కలుగుతుందని మరొకరు కామెంట్ చేశారు.

Also Read: Ashada Masam: ఆషాడ మాసంలో పూజాధికార్యక్రమాలు నిర్వహిస్తారు కానీ.. పెళ్లిళ్లు శుభకార్యాలు చేయరు ఎందుకో తెలుసా