AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌పై బెట్టింగ్‌! రాజానగరంలో బెట్టింగ్‌ ముఠాను పట్టుకున్న పోలీసులు

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలోని చక్రద్వారాభందం గ్రామంలో పోలీసులు క్రికెట్ బెట్టింగ్ ముఠాపై దాడి చేసి 20 మందిని అరెస్టు చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌కు సంబంధించి లక్షల రూపాయల బెట్టింగ్ జరిగిందని పోలీసులు తెలిపారు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో బెట్టింగ్ మాఫియా మరింత ముదిరిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌పై బెట్టింగ్‌! రాజానగరంలో బెట్టింగ్‌ ముఠాను పట్టుకున్న పోలీసులు
Cricket Betting Rajanagaram
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Mar 10, 2025 | 8:56 PM

Share

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారాభందం గ్రామ పంచాయతీ పరిధిలో నిన్న రాత్రి క్రికెట్ బెట్టింగ్ ముఠాపై పోలీసులు పక్కా సమాచారం తో దాడి చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్ ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఆదివారం రాత్రి హోరాహోరీగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించి, ఛాంపియన్‌గా నిలిచింది. ఒక వైపు అంతా మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేస్తుంటే మరోవైపు ఓ బెట్టింగ్‌ ముఠా ఈ మ్యాచ్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడింది. ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు ఉండడంతో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చి పోయారు. ఏకంగా లక్షల్లో బెట్టింగ్ నడిపించారు.

రాజానగరం పోలీ స్ స్టేషన్ పరిధిలోని బ్రిడ్జ్ కౌంట్ లో ఉన్న ఓ విల్లాలో భారీగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించారు. పోలీసులు దాడి చేసి 20 మంది బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కర్ణాటక రాయ్‌చూర్‌ ప్రాంతానికి చెందిన వారిగా సమాచారం. భారీస్థాయిలో ఆన్లైన్ లో బెట్టింగ్ నడిపిస్తున్నట్లు గుర్తించారు. కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను స్టేషన్ కు తరలించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి, బెట్టింగులను నడుపుతున్న వ్యక్తుల వెనుక ఎవరు ఉన్నారు? ఎంత నగదు సీజ్ చేశారానేది మీడియాకి వివరాలు వెల్లడిస్తామని రాజానగరం పోలీసులు తెలిపారు. అయితే మరో రెండు వారాల్లో ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగ్‌ మాఫియా మరింత చెలరేగే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us
JEE Main పేపర్2 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా..ఇద్దరికి 100 పర్సంటైల్
JEE Main పేపర్2 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా..ఇద్దరికి 100 పర్సంటైల్
క్రెడిట్‌ కార్డ్‌ vs పర్సనల్‌ లోన్‌.. ఏది తక్కువ వడ్డీ!
క్రెడిట్‌ కార్డ్‌ vs పర్సనల్‌ లోన్‌.. ఏది తక్కువ వడ్డీ!
Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం..
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
వంకాయ చికెన్ కర్రీ ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
'ది బ్లఫ్' ప్రమోషన్లలో మెరిసిన దేశీ గర్ల్.. ఒక్కో వస్తువు లక్షలే
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
బాలీవుడ్ కపుల్స్ లగ్జరీ అబోడ్స్.. కోట్ల విలువైన తారల కలల సౌధాలు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. రోజూ కావాలంటారు
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం!
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
మష్రూమ్ ఆమ్లెట్ ఇలా వేసి తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే..
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్
రాగి పిండితో అదిరే బ్రేక్ ఫాస్ట్! తక్కువ నూనె, ఎక్కువ ప్రోటీన్