అమృత సమర్పించు.. ఒక లోతైన ప్రణయ్ గాధ.. కులోన్మాదంతో నెత్తురంటిన పవర్‌ఫుల్ ప్రేమ-పరువు కహానీ!
అనగనగా రెండు ప్రణయపక్షులు. కేరాఫ్ మిర్యాలగూడ.. నల్గొండ జిల్లా. వాళ్ల ప్రేమ ఎంత గాఢమైనదంటే వాళ్లవాళ్ల కుటుంబ స్థితిగతులు, ఆర్థికస్తోమతలే కాదు.. కులమతాల అడ్డుగోడల్ని కూడా ఖాతరు చేయలేనంత. ఐనవాళ్ల చావుకు సైతం తెగించేటంత. ఇంతటి లోతైన ప్రేమల్లో పీకల్లోతు కూరుకుపోయిన..

అనగనగా రెండు ప్రణయపక్షులు. కేరాఫ్ మిర్యాలగూడ.. నల్గొండ జిల్లా. వాళ్ల ప్రేమ ఎంత గాఢమైనదంటే వాళ్లవాళ్ల కుటుంబ స్థితిగతులు, ఆర్థికస్తోమతలే కాదు.. కులమతాల అడ్డుగోడల్ని కూడా ఖాతరు చేయలేనంత. ఐనవాళ్ల చావుకు సైతం తెగించేటంత. ఇంతటి లోతైన ప్రేమల్లో పీకల్లోతు కూరుకుపోయిన ఆ ఇద్దరి ప్రేమ కథ అనేక మలుపులు తిరిగి.. ఇప్పటికి క్లయిమాక్స్‌కొచ్చేశాయి. వాళ్ల ప్రేమకు ఖరీదు కట్టి.. ఇటువంటి ప్రేమలు సమాజానికి ప్రమాదకరం అని సందేశమిచ్చారు శ్రీమాన్ కోర్టువారు. ఔను.. రాస్తే ఇది మరో చరిత్రకు తక్కువ.. రక్తచరిత్రకు ఎక్కువ. రొటీన్‌గా సాగే రొమాంటిక్ ప్రేమ కథలకు నెక్స్ట్ లెవల్ అనుకోవచ్చు. ఎందుకంటే.. వీళ్ల ప్రేమకు చెల్లించిన భారీ మూల్యం ఎంతంటే మాటల్లో చెప్పలేనంత. కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న ఇద్దరు ప్రేమైక జీవుల సాహస కృత్యం ఖరీదు.. అక్షరాలా ఒక హత్య.. ఒక ఆత్మహత్య.. ఒక ఉరిశిక్ష.. అరడజనుదాకా యావజ్జీవశిక్షలు. బోనస్‌గా డజన్లకొద్దీ కుటుంబాలకు జీవితకాలం తీరని శోకం. ఎస్.. అమృత లవ్స్ ప్రణయ్.. ఆ తర్వాత అమృత వెడ్స్ ప్రణయ్.. అది కాస్తా ముదిరి ‘మారుతీరావు కిల్స్ ప్రణయ్’ అనే ఘోరమైన మలుపు తీసుకుని పరువు హత్యల చరిత్రకెక్కి.. తర్వాత కోర్టు మెట్లెక్కిన మిర్యాలగూడ పరువుహత్య గుర్తుందా..? దాదాపు ఏడేళ్ల కిందట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఎర్రగులాబీల కథ.. కోర్టు తీర్పుతో మళ్లీ చర్చకొచ్చేసింది. ఇద్దరు ప్రేమికులు.. వాళ్ల ప్రేమకు అడ్డుపడ్డ ఒక తండ్రి.. పేట్రేగిన అతడి కుల...




