MP Bharath: రాజమండ్రి ఎంపీ భరత్ ఒక వైపు, ఎమ్మెల్యే రాజా మరోవైపు. మధ్యలో రైతులు!
ఓవైపు ఎంపీ భరత్, మరోవైపు ఎమ్మెల్యే రాజా..! మధ్యలో పురుషోత్తంపట్నం రైతులు! ఎస్.. వార్ మరో టర్న్ తీసుకుంది. వివాదం ముదురుతోంది.
Rajahmundary Politics: ఓవైపు ఎంపీ భరత్, మరోవైపు ఎమ్మెల్యే రాజా..! మధ్యలో పురుషోత్తంపట్నం రైతులు! ఎస్.. వార్ మరో టర్న్ తీసుకుంది. వివాదం ముదురుతోంది. ఇటీవల పరస్పరం విమర్శలు సంధించుకున్న ఈ ఇద్దరు లీడర్లు ఇప్పుడు రూట్ మర్చారు. డైరెక్ట్ వార్ కాస్తా ఇండైరెక్ట్‌గా సాగుతోంది. రాజమండ్రి ప్రెస్ క్లబ్. సడెన్‌గా అక్కడ పురుషోత్తపట్నం రైతులు ప్రత్యక్షమయ్యారు. వాళ్లంతా ఎత్తిపోతల పథకం కోసం భూములిచ్చారు. పరిహారం కోసం పోరాటం చేస్తున్నారు. తమకు ఎమ్మెల్యే రాజా మద్దతుగా నిలిచారని చెప్పారు. ఇక్కడి వరకు ఓకే.. కానీ ఇక్కడే మ్యాటర్ మరో టర్న్ తీసుకుంది.
దీపక్ అనే ఓ లెక్చరర్ 50 లక్షల పరిహారం ఇప్పిస్తాడని రైతులకు మాట ఇచ్చాడట. అయితే అందులోంచి 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఎపిసోడ్ వెనుక ఎంపీ భరత్ ఉన్నాడన్నది రైతుల ఆరోపణ. అంతే సీన్ కాస్తా రాజా వర్సెస్ ఎంపీ భరత్‌గా మారిపోయింది. రైతుల ఆరోపణలకు భరత్ రిప్లై ఇచ్చారు.. అసలు వాళ్లెవరో కూడా తనకు తెలియదని భరత్ తేల్చి చెప్పేయడంతో ఈ వివాదాస్పద అంశానికి ఫుల్ స్టాప్ పడింది.
ఇదిలా ఉండగా, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి (మం) రామవరంలో వై.సి.పి, టి.డి.పి శ్రేణుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటిని ముట్టడించారు పెడపర్తి సర్పంచ్ నల్లమిల్లి కాంతమ్మ. రామవరం పొలిమేరల్లోనే సర్పంచ్ కాంతమ్మ సహా వై.సి.పి కార్యకర్తలను పోలీసులు ఆపివేశారు. రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద భారీగా టి.డి.పి శ్రేణులు ఉండటంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇటీవల పెడపర్తిలో పట్టుబడిన భారీ గుట్కా నిల్వలతో సర్పంచ్ కుమారుడికి సంబంధం ఉందని చేసిన ఆరోపణల్ని నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నించించారు సర్పంచ్.