వెదర్ అలర్ట్.. బంగాళాఖాతంలో వాయుగుండం.. ఆ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వాయుగుండంగా(Low Pressure in Bay of Bengal) బలహీనపడింది. ఇది నైరుతి దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు తీరం వైపునకు ప్రయాణిస్తోంది. రాగల 24 గంటల్లో..

వెదర్ అలర్ట్.. బంగాళాఖాతంలో వాయుగుండం.. ఆ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం
Ap Rains
Follow us

|

Updated on: Mar 06, 2022 | 2:48 PM

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వాయుగుండంగా(Low Pressure in Bay of Bengal) బలహీనపడింది. ఇది నైరుతి దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు తీరం వైపునకు ప్రయాణిస్తోంది. రాగల 24 గంటల్లో ఇది క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో రాగల మూడు రోజుల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఒకటి రెండు చోట్లు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. రేపు,ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అధికారులు వివరించారు. రాయలసీమ(Rayala Seema)లో ఒకటి రెండు చోట్ల జల్లులతో కూడిన వర్షం కురిస్తాయని తెలిపారు.

ఇంట్లో నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని పేర్కొంది. ఇప్పటికే సముద్రం లోపలకు వేటకు వెళ్లిన వారు వీలైనంత త్వరగా తీరానికి చేరుకోవాలని సూచించారు. గతేడాది నవంబర్ లో జరిగిన వరద బీభత్సాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. తీరం వెంబడి 45నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

Also Read

Hyderabad: సండే రోజు ప్రశాంతత కోసం గుడికి వెళ్తే.. భక్తుడిని చితక్కొట్టిన పూజారి

INDW vs PAKW: పాకిస్తాన్‌పై వరుసగా 11వ విజయం సాధించిన భారత్.. కీలక పాత్ర పోషించిన 5గురు ఆటగాళ్లు..

Telangana: స్క్రూలు మింగిన ఏడాదిన్నర బాలుడు… వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లిన పేరెంట్స్.. చివరకు