అక్రమ రవాణాకు అడ్డాగా మారిన హైవే.. పోలీసుల తనిఖీల్లో షాకింగ్ విషయాలు.. అదే కారణమా

అక్రమ రవాణాకు అడ్డాగా మారిన హైవే.. పోలీసుల తనిఖీల్లో షాకింగ్ విషయాలు.. అదే కారణమా
Panchalingla

హైదరాబాద్ - బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారి(Hyderabad - Bangalore National Highway 44 ) అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఈ మార్గంలో నిత్యం ఏదో ఒక రూపంలో అక్రమ రవాణా బయటపడుతూనే ఉంది. ఈ హైవేపై ప్రధాన కూడలి.....

Ganesh Mudavath

|

Mar 06, 2022 | 3:26 PM

హైదరాబాద్ – బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారి(Hyderabad – Bangalore National Highway 44 ) అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఈ మార్గంలో నిత్యం ఏదో ఒక రూపంలో అక్రమ రవాణా బయటపడుతూనే ఉంది. ఈ హైవేపై ప్రధాన కూడలి అయిన కర్నూలు చెక్ పోస్టులో భారీగా బంగారం, వెండి, నగదు లభ్యం కావడమే ఇందుకు నిదర్శనం. గతంలో ఏపీలో మద్యం ధరలు విపరీతంగా ఉండటంతో సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం ఏపీ లోకి అక్రమ రవాణా అయింది. దీనిని నియంత్రించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటైంది. ఇందులో భాగంగానే కర్నూలులోని పంచలింగాల చెక్ పోస్ట్(Panchalingala Check Post) రూపుదిద్దుకుంది. చెక్ పోస్ట్ ప్రారంభమైన మొదటి రోజు నుంచి అక్రమ రవాణాకు చెక్ పెట్టింది. కోట్ల రూపాయల విలువైన అక్రమ మద్యాన్ని పట్టుకుంది. కొన్ని వందల మంది అరెస్టయ్యారు. వేలాది వాహనాలు సీజ్ అయ్యాయి. ఇటీవల ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడంతో మద్యం అక్రమ రవాణా(Smuggling) పూర్తిగా తగ్గిపోయింది. ఈ క్రమంలో చెక్ పోస్ట్ అధికారులు.. ఇతర అక్రమ మార్గాలను నియంత్రించడంపై దృష్టి పెట్టారు.

హైదరాబాద్ నుంచి బెంగళూరు చెన్నై నగరాలకు వివిధ మార్గాలలో రవాణా అవుతున్న బంగారం, వెండి, వజ్రాలను భారీ ఎత్తున అధికారులు పట్టుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఐదు కోట్ల విలువైన బంగారు వెండి వజ్రాలను సీజ్ చేశారు. బంగారం, వజ్రాలు, వెండి క్రయ విక్రయాలపై కేంద్రం భారీగా పన్నులు విధించింది. కోటి రూపాయల విలువైన ఆభరణాలు కొనుగోలు 20 నుంచి 25 లక్షల రూపాయలు పన్నులు చెల్లించాల్సి ఉంది. వీటిని ఎగ్గొట్టేందుకు అక్రమార్కులు బస్సులు, లారీలు, కార్లు, ఆటోల్లో వ్యాపారాన్ని సాగిస్తున్నారు. తమిళనాడులోని సేలం, కోయంబత్తూరు ప్రాంతాలకు చెందిన వారిని అయ్యప్పస్వామి ట్రావెల్స్ లో తనిఖీ చేయగా బంగారం, వెండి, వజ్రాలు పట్టుబడ్డాయి. వీటి విలువ ఐదు కోట్ల రూపాయల పైనే ఉంటుందని ఎస్ఈబీ అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read

Attention! SSC CHSL 2022 కొలువులకు దరఖాస్తు చేసుకున్నారా? మరి కొన్ని గంటల్లో ముగియనున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ..

No Internet: ఆ రాష్ట్రంలో రేపటి నుంచి 8 రోజులు ‘ఇంటర్నెట్ సేవలు బంద్’.. కారణమేంటంటే..

Firing: అమృత్‌సర్ లో దారుణం.. సహచరులపై జవాన్ కాల్పులు.. ఆపై ఆత్మహత్య..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu