AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు పునరుద్ధరణ, పొడగింపు

Indian Railways News: ఔరంగాబాద్ నుంచి తిరుపతికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Railway News: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు పునరుద్ధరణ, పొడగింపు
Railway News
Janardhan Veluru
|

Updated on: Apr 27, 2022 | 5:36 PM

Share

Indian Railways News: ఔరంగాబాద్ నుంచి తిరుపతికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్ – రేణిగుంట మధ్య నడిచే వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను (నెం.17621/17622) తిరుపతి వరకు పొడగించారు. ఔరంగాబాద్ – తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం.17621) ను మే 6వ తేదీ నుంచి తిరుపతి వరకు నడపనున్నారు. ఈ వీక్లీ రైలు ప్రతి శుక్రవారం రాత్రి 08.50 గం.లకు ఔరంగాబాద్‌ నుండి బయలుదేరి మరుసటి రోజు (శనివారం) సాయంత్రం 7 గం.లకు రేణిగుంటకు చేరుకుంటుంది. సాయంత్రం 7.30 గం.లకు తిరుపతికి చేరుకుంటుంది.

అలాగే తిరుపతి – ఔరంగాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం.17622) మే 7వ తేదీ నుంచి తిరుపతి నుంచి బయలుదేరి వెళ్లనుంది. ఈ వీక్లీ రైలు ప్రతి శనివారం రాత్రి 08.50 గం.లకు తిరుపతిలో బయలుదేరి.. రాత్రి 09.23 గం.లకు రేణిగుంటకు చేరుకుంటుంది. రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి 09.25 గం.లకు బయలుదేరి.. మరుసటి రోజు(ఆదివారం) రాత్రి 08.40 గం.లకు ఔరంగాబాద్‌కు చేరుకుంటుంది.

ఇదిలా ఉండగా సికింద్రాబాద్ -రాయ్‌పూర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు (నెం.12771/127772)ను రైల్వే శాఖ పునరుద్ధరించనుంది. సికింద్రాబాద్ -రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (నెం.12771)ను ఏప్రిల్ 27 తేదీ నుంచి.. రాయ్‌పూర్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (నెంబర్.12772) ను ఏప్రిల్ 28 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read..

AP CM Jagan: విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు.. అధికారులకు వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

NHAI Recruitment 2022: నెలకు లక్షకుపైగా జీతంతో.. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. అర్హతలివే!