AP CM Jagan: విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు.. అధికారులకు వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
రాష్ట్రంలో ఒకట్రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రుయా ఆసుపత్రి అంబులెన్స్ వ్యవహారం, విజయవాడ అత్యాచార ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.
AP CM YS Jagan Mohan Reddy Warning: రాష్ట్రంలో ఒకట్రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయవాడ అత్యాచార ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకూడదని హెచ్చరించారు. అధికారులు అలసత్వం వీడకుంటే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు సీఎం. పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహించారనే ఆరోపణలపై సీఐ, ఎస్‌ఐలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం అంటే ఓ నమ్మకమని.. నమ్ముకున్న ప్రజలకు మనం అన్నివేళలా మంచి చేయాలని సూచించారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం జగన్.
అలాగే, తిరుపతి రుయా తరహా ఘటనపై గట్టి వార్నింగ్ ఇచ్చారు సీఎం జగన్. రాష్ట్రంలో ఇకపై తిరుపతి రుయా తరహా ఘటనలు పునరావృతం కావొద్దని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో అంబులెన్స్ డ్రైవర్లు మాఫియాలా తయారై.. ఓ అభాగ్యుడితో అమానవీయంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఘటనపై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలన్నారు. ఆరోగ్య మిత్ర కియోస్క్‌ల వద్ద ఫిర్యాదు నంబర్లు కనిపించాలని చెప్పారు. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా బాధితులు ఫిర్యాదు చేసేలా ఉండాలని సూచించారు.
తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అంబులెన్స్ డ్రైవర్లు మాఫియాలా తయారయ్యారు. కుమారుడు చనిపోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న ఓ అభాగ్యుడితో అమానవీయంగా వ్యవహరించారు. వేలరూపాయల ఛార్జీ భరించలేనని మొత్తుకున్నా కనికరించలేదు. అతని యజమాని తక్కువ ధరకు అంబులెన్స్ మాట్లాడి పంపితే.. అడ్డుకున్నారు. చేసేది లేక కుమారుడి మృతదేహాన్ని భుజంపై వేసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరాల్సి వచ్చింది. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం కొండూరు పంచాయతీ కేసీ ఎస్టీ కాలనీకి చెందిన కంభంపాటి నరసింహులు తన కుమారుడు జాషువా(10)ను కిడ్నీ సమస్య కారణంగా ఈ నెల 24న రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి బాలుడు మృతి చెందిన సంగతలి తెలిసిందే.