శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి దంపతులు
రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా శనివారం రాత్రే తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి ఇవాళ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిసేవలో పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటన నేపధ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో కోవింద్ శ్రీహరికోట వెళ్లనున్నారు. సోమవారం తెల్లవారుజామున చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగాన్ని వీక్షించనున్నారు. ఆ తర్వాత తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి బయల్దేరి […]
రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా శనివారం రాత్రే తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి ఇవాళ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిసేవలో పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటన నేపధ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో కోవింద్ శ్రీహరికోట వెళ్లనున్నారు. సోమవారం తెల్లవారుజామున చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగాన్ని వీక్షించనున్నారు. ఆ తర్వాత తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.