Andhra Pradesh: సినిమాటిక్ గా సాగిన ఘటన.. కదులుతున్న ట్రైన్‌లో గర్భిణికి పురిటినొప్పులు మొదలు..
రైల్వేలో గర్భిణికి పురిటినొప్పులు తీవ్రమవుతున్నాయి. దిక్కుతోచని పరిస్థితిలో ఆమె భర్త రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హాల్ట్ లేకపోయినా రైల్వే అధికారులు తాడేపల్లిగూడెంలో రైలు నిలిపారు. అప్పటికే గర్భిణీ పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చింది. తల్లి బిడ్డల ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. రైలు తన గమ్యం వైపు ముందుకు వెళ్లింది. అచ్చం సినిమాటిక్ గా సాగిన ఘటన తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో జరిగింది.

తన గమ్యం వైపు వేగంగా ప్రయాణిస్తున్న రైలులో గర్భిణీ అయిన ఒక ప్రయాణికురాలికి హఠాత్తుగా పురిటినొప్పులు మొదలయ్యాయి. సమీపంలో ఎక్కడా హాల్ట్ లేదు. ఆమె వెంట ఉన్న వాళ్లకి కాళ్లు చేతులు ఆడటం లేదు. ఏం చెయ్యాలో తెలియక, సహాయం కోసం అందరినీ అడుగుతున్నారు. మరో వైపు ఆమెకు పురిటినొప్పులు తీవ్రమవుతున్నాయి. దిక్కుతోచని పరిస్థితిలో ఆమె భర్త రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హాల్ట్ లేకపోయినా రైల్వే అధికారులు తాడేపల్లిగూడెంలో రైలు నిలిపారు. అప్పటికే గర్భిణీ పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చింది. తల్లి బిడ్డల ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.
రైలు తన గమ్యం వైపు ముందుకు వెళ్లింది. అచ్చం సినిమాటిక్ గా సాగిన ఘటన తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో జరిగింది. సుశాంత, రశ్మిత అనే దంపతులు ఎర్నాకులం నుంచి హతియా వెళ్లే దర్తి అబ్బా ఎక్స్ప్రెస్ లో ప్రయాణం చేస్తున్నారు. వారు బాలంగిరి వెళ్లేందుకు కోయంబత్తూర్ లో ట్రైన్ ఎక్కారు. రష్మిత గర్భం దాల్చి ఏడు నెలలు పూర్తవడంతో డెలివరీ కోసం ఆమె భర్త సుశాంత ఆమె పుట్టింటికి తీసుకు వెళుతున్నాడు. అయితే అనుకోకుండా ట్రైన్ లోనే రష్మితకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దాంతో ఆమె భర్త సుశాంత కంగారుపడ్డాడు. వెంటనే తన భార్య పడుతున్న ప్రసవ వేదన గురించి సమాచారాన్ని రైల్వే సిబ్బందికి అందించాడు.
అప్పటికి రైలు తాడేపల్లిగూడెం సమీపానికి చేరుకుంటుంది. కానీ తాడేపల్లిగూడెంలో ట్రైన్ ఆపడానికి హాల్టు లేదు. దాంతో సిబ్బంది రైల్వే ఉన్నత అధికారులను సంప్రదించి ట్రైన్ తాడేపల్లిగూడెం స్టేషన్లో ఆగేందుకు అనుమతి తీసుకున్నారు. అదే క్రమంలో రైల్వే టి సి 108కు సమాచారం ఇవ్వడంతో ట్రైన్ తాడేపల్లిగూడెం స్టేషన్ వద్ద ఆగే సమయానికి 108 అంబులెన్స్ సిబ్బంది స్ట్రక్చర్ తో రెడీగా ఉన్నారు. ఈ లోపే రశ్మిత ట్రైన్లోనే మగ బిడ్డను ప్రసవించింది. దాంతో 108 సిబ్బంది ట్రైన్ ఆగిన వెంటనే భోగి లోనే ఆమెకు ప్రధమ చికిత్స చేశారు. అయితే బిడ్డ ఏడో నెలలో పుట్టడంతో బరువు చాలా తక్కువగా ఉండడంతో స్ట్రక్చర్ పై రష్మితను ఉంచి సిబ్బంది సహాయంతో 108 అంబులెన్స్ వద్దకు తీసుకువచ్చారు. అంబులెన్స్ లో వారిని ఎక్కించి అక్కడ నుంచి తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి రష్మితను, బిడ్డను తరలించారు. అయితే తన భార్య రశ్మిత, తన బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆమె భర్త సుశాంత తెలిపారు. ట్రైన్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళ విషయంలో రైల్వే అధికారులు చూపిన చొరవకు, అదేవిధంగా సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వారికి వైద్య చికిత్సలు అందించిన 108 అంబులెన్స్ సిబ్బందిని పలువురు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ లోని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




