AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కందిచేనులో గుప్పుమన్న ఘాటైన వాసన.. లోపలకెళ్లి చూడగా ఆశ్చర్యపోయిన రైతులు..

రైతులందు మత్తు రైతులు వేరయా.. విశ్వదాభిరామ.. వినురవేమ.. అంటున్నాడా రైతు.. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే మిగిలేది అప్పులే కావడంతో వినూత్న రీతిలో వ్యవసాయం చేయాలనుకున్నాడు.. వినూత్న రీతిలో వ్యవసాయం అంటే లాభసాటి వ్యవసాయం ఎలా చేసినా..

కందిచేనులో గుప్పుమన్న ఘాటైన వాసన.. లోపలకెళ్లి చూడగా ఆశ్చర్యపోయిన రైతులు..
Crop Cultivation
Fairoz Baig
| Edited By: |

Updated on: Mar 27, 2024 | 9:32 AM

Share

రైతులందు మత్తు రైతులు వేరయా.. విశ్వదాభిరామ.. వినురవేమ.. అంటున్నాడా రైతు.. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే మిగిలేది అప్పులే కావడంతో వినూత్న రీతిలో వ్యవసాయం చేయాలనుకున్నాడు.. వినూత్న రీతిలో వ్యవసాయం అంటే లాభసాటి వ్యవసాయం ఎలా చేసినా ఓకే కదా అనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా ప్లాన్‌ సిద్దం చేశాడు.. కందిపంట మధ్యలో గంజాయి సాగు చేస్తే బోలెడు లాభాలు సంపాదించవచ్చని ఆశపడ్డాడు. పట్టుబడితే ఊచలు లెక్కపెట్టాలన్న విషయం తెలిసినా ఈజీగా మనీ సంపాదించడం అనే అత్యాశ ముందు అతనికి ఇవేమీ గుర్తుకు రాలేదు. తాను ఇప్పటికే పండిస్తున్న కందిపంట మధ్యలో అంతరపంటగా 280 గంజాయి మొక్కలను నాటి గుట్టు చప్పుడు కాకుండా సాగుచేస్తున్నాడు.. చుట్టుపక్కల రైతులకు కూడా ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినా సరే డామిట్‌.. కధ అడ్డం తిరిగింది. ఎవరు అందించారో సెబ్‌ అధికారులకు ఉప్పందింది. వెంటనే గంజాయి పంట పండిస్తున్న పొలంలో సెబ్‌ అధికారులు సోదాలు చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. రైతును పట్టుకుని కటాకటాల వెనక్కి నెట్టారు.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గంగుపల్లి గ్రామ శివారులో రైతు కేశనపల్లి బ్రహ్మయ్య ఈ ఏడాది కంది పంట సాగు చేస్తున్నాడు. కందిపంట పొలంలో అంతర్గత పంటగా భారీగా గంజాయి మొక్కలను సాగు చేపట్టాడు రైతు బ్రహ్మయ్య. సాధువులు గంజాయి విత్తనాలను ఇవ్వగా వాటిని విత్తాడు.. 280 గంజాయి మొక్కలను గుట్టుచప్పుడు కాకుండా.. అంతర్గంతంగా నాటి సాగు చేయడం ప్రారంభించాడు. అందుకు అవరసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే విషయం ఎక్కడ లీకైందో తెలియదు కానీ గంజాయి వాసన గుప్పుమంది. యర్రగొండపాలెం సెబ్ అధికారులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే యర్రగొండపాలెం స్పెషల్ ఎన్ ఫోర్స్‌మెంట్ బ్యూరో సీఐ నాగేశ్వరావు తన సిబ్బందితో గంజాయి సాగులో ఉన్న పొలంపై దాడిచేసి 280 మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.

రైతు బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. గంగుపల్లి గ్రామానికి సమీపంలో భారీస్థాయిలో సాగులో ఉన్న గంజాయి మొక్కలను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలుసుకున్న ఆ గ్రామ రైతులతో పాటు, చుట్టూ పక్కల గ్రామాల రైతులు ఉల్లిక్కి పడ్డారు… ఈ దాడిలో పాల్తొన్న సెబ్ సీఐ నాగేశ్వరావు మాట్లాడుతూ.. గంజాయి సాగు అనేది చట్టవ్యతిరేక చర్య అని, ఇలా ఇష్టానుసారం వ్యవహరిస్తూ అక్రమంగా నిషేధిత గంజాయి సాగు చేసే వారు జైలు పాలు కాక తప్పదని హెచ్చరిస్తున్నారు… గంగుపల్లిలో తన కంది పంటలో అంతర్గతంగా గంజాయి సాగు చేస్తున్న బ్రహ్మయ్య అనే రైతు ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అన్నారు… రైతు బ్రహ్మయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సెబ్‌ సిఐ నాగేశ్వరరావు తెలిపారు.

ఇది చదవండి: తెల్లవారుజామున శ్మశానం నుంచి వింత శబ్దాలు.. అటుగా వెళ్తున్న రైతులు భయం.. భయంగా.!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..