AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakinada: రాత్రికి రాత్రే జెండా ఎత్తేసిన పోస్ట్ మాస్టర్.. పక్కా ప్లానింగ్‌ వేసి జనాలకు మస్కా.. పాపం వారంతా

పోస్ట్ మాస్టర్ పెద్ద మోసానికి పాల్పడ్డాడు. పేద, మధ్యతరగతి వర్గాల నగదు కాజేసి రాత్రికి రాత్రే జంప్ అయ్యాడు. దీంతో బాధితులంతా ఆందోళనకు దిగారు.

Kakinada: రాత్రికి రాత్రే జెండా ఎత్తేసిన పోస్ట్ మాస్టర్.. పక్కా ప్లానింగ్‌ వేసి జనాలకు మస్కా.. పాపం వారంతా
Postmaster Cheating
Ram Naramaneni
|

Updated on: Jul 09, 2022 | 10:23 AM

Share

AP News: కాకినాడ జిల్లాలో ఓ పోస్ట్ మాస్టర్ జెండా ఎత్తేశాడు. లక్షలతో రాత్రికి రాత్రే ఉడాయించాడు. తాళ్లరేవు మండలం(thallarevu mandal) కేశవపురం( Kesavapuram) పోస్ట్ మాస్టర్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం ఘరానా మోసానికి పాల్పడ్డాడు. లక్షలాది రూపాయల కాజేసి పోస్ట్ ఆఫీస్‌కు తాళాలు వేసి పరారయ్యాడు. విషయం తెలిసిన వెంటనే స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఎంతోమంది పోస్టాఫీస్‌లో పలు స్కీముల కింద నగదు దాచుకుంటున్నారు. అందేకాదు ఇంకొంతమంది తమ బంగారం తాకట్టు పెట్టి అతని వద్ద అప్పు తీసుకున్నారు. దీంతో బాధితులంతా కేశవపురం పోస్ట్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చెయ్యాలని. ..ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పాలంటూ నిరసనకు దిగారు. పోస్ట్ మాస్టర్ సుబ్రహ్మణ్యంను వెతికి తీసుకువచ్చి.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  గత మూడు సంవత్సరాలుగా కేశవపురం పోస్ట్ ఆఫీస్‌లో పోస్టు మాస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు సుబ్రహ్మణ్యం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..