AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Ring: చంద్రబాబు చేతి వేలికి ఉంగరం.. అసలు సంగతి తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Chandrababu Ring: 40 ఏళ్ల రాజకీయం జీవితం.. సాదాసీదా జీవితం. జేబులో పెన్నుతో మాత్రమే చంద్రబాబు కనిపించేవారు. చేతికి వాచీ కూడా పెట్టుకునేవారు కాదు. కానీ ఎడమ చేతి చూపుడు వేలుకు ఇప్పుడు రింగ్‌ పెట్టుకుంటున్నారు. ఈ సడెన్‌ ఛేంజ్‌ వెనుక రీజనేంటి? బాబు సెంటిమెంట్‌గా మారారా?

Chandrababu Ring: చంద్రబాబు చేతి వేలికి ఉంగరం.. అసలు సంగతి తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Chandrababu Ring
Sanjay Kasula
|

Updated on: Jul 07, 2022 | 10:40 AM

Share

చంద్రబాబు ఎడమ చేతి వేలికి రింగ్‌ వచ్చింది. ఈ రింగ్‌ ఇప్పుడు వార్త అయింది. జులై 1 నుంచి చంద్రబాబు ఎడమ చేతికి ఈ రింగ్‌ పెట్టుకున్నారు. ఆరోజు పెట్టిన ప్రెస్‌మీట్‌తో పాటు నిన్న జరిగిన మదనపల్లి మహానాడు సభలో చంద్రబాబు చేతికి రింగ్‌ కనిపించింది. ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్‌గా మారింది.  40 ఏళ్ల రాజకీయం జీవితం.. సాదాసీదా జీవితం. జేబులో పెన్నుతో మాత్రమే చంద్రబాబు కనిపించేవారు. చేతికి వాచీ కూడా పెట్టుకునేవారు కాదు. కానీ ఎడమ చేతి చూపుడు వేలుకు ఇప్పుడు రింగ్‌ పెట్టుకుంటున్నారు. ఈ సడెన్‌ ఛేంజ్‌ వెనుక రీజనేంటి? బాబు సెంటిమెంట్‌గా మారారా? ఒక్కసారి ఇక్కడ పరిశీలింద్దాం.

చంద్రబాబు ఇంతకుముందు సింపుల్‌గా ఉండేవారు. తనకు సెంటిమెంట్లు లేవని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఈ ఉంగరం సెంటిమెంట్‌గా మారిందా? అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. జులై 1కి ముందు అంటే జూన్‌ 23న చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టారు. కానీ ఆ సమయంలో ఆయన చేతికి ఉంగరం లేదు. కానీ వారం తిరిగేసరికి ఆయన చేతికి ఉంగరం వచ్చింది.

చంద్రబాబు చేతికి ఉన్న ఉంగరం చూసిన తర్వాత చంద్రబాబు ఇది పక్కా ప్లేన్‌ ప్రకారమే రింగ్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎలాంటి రంగురాళ్లూ లేవు. ఆయన ఎడమ చేతికి చూపుడు వేలు ఉంగరం పెట్టుకుంటున్నారు. ఈ చూపుడు వేలికి ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎడమ చేతి చూపుడువేలికి ఉంగరం ధరించడం వెనుక రకరకాల కారణాలు ఉన్నాయనేది జ్యోతిష్యుల మాట. చూపుడు వేలు నాయకత్వ లక్షణాలు, పరిపాలనా ప్రవర్తన, శక్తి యొక్క భావాన్ని ప్రతిబింబిస్తాయని అంటున్నారు.అందుకోసమే చూపుడు వేలికి ముదురు రంగు వెండి ఉంగరాన్ని ధరిస్తారట. అధికారాన్ని ఈ చూపుడు వేలు సూచిస్తుందట. గతంలో శక్తివంతమైన మహారాజులు చూపుడు వేలుకి ఉంగరం ధరించేవారని చెబుతున్నారు.

చంద్రబాబు చేతికి పెట్టుకున్న ఉంగరం కూడా ప్లేన్‌గా ఉంది. ముదురు రంగులో ఉంది. దీంతో శక్తి ప్రభావాన్ని ప్రతిబింబిచేందుకే చంద్రబాబు చూపుడు వేలికి ఉంగరం పెట్టుకున్నారని తెలుస్తోంది. జ్యోతిష్యులు ఇచ్చిన సలహా లేదో..వేరే ఎవరో ఇచ్చిన సలహా తెలియదు. కానీ జులై 1 ప్రెస్‌మీట్‌ నుంచి చంద్రబాబు చేతికి ఉంగరం కనిపిస్తోంది. ఇది ఇప్పుడు ఏపీ పొలిటికల్‌ స్కీన్‌పై హాట్‌ టాపిక్‌ అయింది.

జ్యోతిష్యం ఏం చెబతుందోంది..

జ్యోతిషశాస్త్రంలో, చూపుడు వేలు బృహస్పతితో పోల్చబడుతుంది. చూపుడు వేలు నాయకత్వ లక్షణాలు, పరిపాలనా ప్రవర్తన మరియు శక్తి యొక్క భావాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి చూపుడు వేలితో ముదురు రంగు వెండి ఉంగరాన్ని ధరించడం ఆచారం. అధికారాన్ని సూచిస్తుంది. నాయకత్వ లక్షణాలు, అభిలాషలను సూచిస్తుంది. ఈ వేలికి వేరే శక్తి ఉంది. గతంలో శక్తివంతమైన రాజు మహారాజాలు చూపుడు వేలులో ఉంగరం ధరించేవారు. కాబట్టి చూపుడు వేలులో ఉంగరం ధరించడం వల్ల ఈ ప్రాంతాల్లో మీకు ఊపు లభిస్తుంది. చూపుడు వేలికి బ్లూ పుష్పరాగము, అమెథిస్ట్ ప్రాధాన్యత ఇవ్వబడతాయి.