AP Politics: ఏపీ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది.? ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకోనున్నారు.
ఏపీ రాజకీయాల్లో కొత్త పొత్తుపొడుపులు పొడుస్తున్నాయా? మరి ఎత్తిపొడుపుల సంగతేంటి! టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ నడుస్తుందా లేక వైసీపీతో దోస్త్ మేరా దోస్త్ అంటోందా? బీజేపీతో దోస్తీ లేదంటోంది వైసీపీ. ఆ పార్టీకి బీజేపీతో సంబంధాలు బాగున్నాయి కాబట్టే అన్ని వ్యవహారాలు చక్కపెట్టుకుంటున్నారని...
ఏపీ రాజకీయాల్లో కొత్త పొత్తుపొడుపులు పొడుస్తున్నాయా? మరి ఎత్తిపొడుపుల సంగతేంటి! టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ నడుస్తుందా లేక వైసీపీతో దోస్త్ మేరా దోస్త్ అంటోందా? బీజేపీతో దోస్తీ లేదంటోంది వైసీపీ. ఆ పార్టీకి బీజేపీతో సంబంధాలు బాగున్నాయి కాబట్టే అన్ని వ్యవహారాలు చక్కపెట్టుకుంటున్నారని ఆరోపిస్తోంది టీడీపీ. ఇక్కడే కన్ఫ్యూజన్ మొదలైంది. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళతాయనుకున్న టైమ్‌లో అచ్చెన్న మాటలకు అర్థాలేంటి? వైసీపీకి బీజేపీ దోస్త్ అంటే తమకు దుష్మన్ అన్నట్టే కదా! అయితే ఇంతకీ బీజేపీకి ఎవరికి శత్రువు? ఎవరికి మిత్రుడు? ఏపీలో కన్ఫ్యూజన్ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి.
నిన్నటిదాకా ఒక మాట ఇప్పుడు మరో బాట అన్నట్టు సాగుతోంది ఏపీ బీజేపీ. నిన్నమొన్నటిదాకా జగన్ సర్కార్‌తో సంబంధాలు బాగానే ఉన్నట్టు కనిపించినా.. లేటెస్టుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఆ తర్వాత మొన్ననే విశాఖలో హోం మంత్రి అమిత్ షా…జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీతో బీజేపీకి పొసగట్లేదు…వాళ్లు టీడీపీతో కలిసి ముందుకు సాగుతారనే ఊహాగానాలు చెలరేగాయి.
ఇక బీజేపీ ఆరోపణలకు వైసీపీ నేతలు స్ట్రాంగ్‌గా కౌంటర్లు ఇచ్చారు. తాజాగా సీఎం జగన్ కూడా బీజేపీ తమకు అండగా ఉండకపోవచ్చని సంచనల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నడ్డా, అమిత్ షాలు…బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టులు రాసిచ్చిన స్ర్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు సజ్జల. బీజేపీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు ఆయన. ఇదిలా ఉంటే మరోవైపు పవన్ బీజేపీ, టీడీపీతో కలుస్తామని తేల్చి చెప్పారు. ఆ మధ్య టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ ఉంటుందని పవన్ కల్యాణ్ కూడా స్పష్టం చేశారు.
మరోవైపు అచ్చెన్న బీజేపీతో వైసీపీకి సత్సంబంధాలున్నాయని బాంబు పేల్చారు. బీజేపీ, టీడీపీ కలిసి వెళతాయి అనుకుంటున్న టైమ్‌లో సైకిల్ పార్టీ నేత అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో వైసీపీకి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. అచ్చెన్న మాటలకు అర్థాలే వేరా? బీజేపీ వాళ్లేమో జగన్ సర్కార్‌పై విమర్శల బండలు విసిరేస్తున్నారు. వైసీపీ వాళ్లు అంతకంటే స్ట్రాంగ్‌గా కౌంటర్ బండలు విసిరేస్తున్నారు. ఇప్పుడేమో ఆ రెండు పార్టీలు ఒక్కటే అని టీడీపీ నేత అచ్చెన్న అనడంతో ఏపీ రాజకీయాల్లో కన్ఫ్యూజన్ పీక్స్‌కి చేరింది. ఇది చాలదన్నట్టు మంత్రి బొత్స, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శల తూటాలు పేల్చుకుని కన్ఫ్యూజన్‌కే కన్ఫ్యూజన్ తెప్పించారు.
ఇలా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఒకళ్లపై మరొకళ్లు విమర్శల తూటాలు పేల్చుకుంటుంటే…ఏపీ జనానికే కాదు…ఆ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్న విశ్లేషకులకు మైండ్ బ్లాంక్ అయిపోతోంది. ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు. ఏ పొలిటికల్ పార్టీ..ఎవరితో కలుస్తుంది? ఈ రాజకీయ బేతాళ ప్రశ్నకు సమాధానం దొరక్క అంతా కన్ఫ్యూజన్‌లో కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది. చివరకు వైసీపీ, టీడీపీ కలిసి బీజేపీని కార్నర్ చేశాయా? తాము ఎవరివైపు ఉన్నాము అనే విషయంపై కాషాయ పార్టీ ఇప్పుడు సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..