AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లారీలో గుట్టుగా యవ్వారం.. పోలీసుల సడెన్‌ ఎంట్రీ! ఆ తర్వాత సీన్‌ ఇదే

గో మాంసం ఇపుడు ఏపీని షేక్ చేస్తుంది. విశాఖలోని మిత్ర కోల్డ్ స్టోరేజ్ లో భారీగా దొరికిన మాంసం నిల్వల శాంపిల్స్ లో గో మాంసం దొరకటంపై పెద్దదుమారం రేగింది. దీనిపై సమగ్ర విచారణ జరుగుతున్నా మరో వైపు గోవుల అక్రమ రవాణా ఆగటం లేదు. తణుకులో లోహం ఫుడ్ ఫ్యాక్టరీ సైతం వివాదాస్పదంగా.

లారీలో గుట్టుగా యవ్వారం.. పోలీసుల సడెన్‌ ఎంట్రీ! ఆ తర్వాత సీన్‌ ఇదే
Illegal Cow Smuggling In Srikakulam
B Ravi Kumar
| Edited By: |

Updated on: Nov 25, 2025 | 8:54 PM

Share

ఏలూరు, నవంబర్‌ 25: గో మాంసం ఇపుడు ఏపీని షేక్ చేస్తుంది. విశాఖలోని మిత్ర కోల్డ్ స్టోరేజ్ లో భారీగా దొరికిన మాంసం నిల్వల శాంపిల్స్ లో గో మాంసం దొరకటంపై పెద్దదుమారం రేగింది. దీనిపై సమగ్ర విచారణ జరుగుతున్నా మరో వైపు గోవుల అక్రమ రవాణా ఆగటం లేదు. తణుకులో లోహం ఫుడ్ ఫ్యాక్టరీ సైతం వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ గోవధ జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరో వైపు గోవుల అక్రమ తరలింపు ఆగడంలేదు. తాజాగా గోవులను తరలిస్తున్న లారీని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి పోలీసులు పట్టుకున్నారు.

హిందూ సాంప్రదాయంలో గోవుకు ప్రత్యేక స్థానం ఉంది. గోవులను దేవతలా పూజిస్తారు. ఆవు పాలను అమృతంగా భావిస్తారు. గోవు లను వధించడం, అక్రమంగా తరలించడంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. అటువంటి గోవులను అక్రమంగా తరలించి గో మాంసాన్ని అక్రమంగా అమ్ముకుంటున్నారు. రాష్ట్రాలు దాటి అక్రమంగా గోవులను తరలించేస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ లారీని పోలీసులు ఆపారు. అనంతరం చెక్‌ చేయగా.. లారీ నిండా ఆవులు కనిపించాయి. వీటిని శ్రీకాకుళం జిల్లా నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుసుకున్నారు. మొత్తం 70 గోవులను తరలిస్తున్న ఈ లారీని సీజ్ చేశారు.

ఇక లారీలో గోవులను తరలిస్తున్న ఉత్తరప్రదేశ్ కి చెందిన మహబూబ్, ఇస్తాకర్‌లను జీలుగుమిల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీని జీలుగుమిల్లి స్టేషన్ కి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతి కుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.