AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇరుకైన సందుల్లో గొంతు నులిమి.. అడవిలో గొంతు కోసి.. పరుపుహత్య కేసులో సంచలన విషయాలెన్నో..

నంద్యాల జిల్లాలో జరిగిన పరువు హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సంచలన విషయాలు తెలుస్తున్నాయి. హత్యలో ఆలమూరు..

Andhra Pradesh: ఇరుకైన సందుల్లో గొంతు నులిమి.. అడవిలో గొంతు కోసి.. పరుపుహత్య కేసులో సంచలన విషయాలెన్నో..
Daughter Murder
Ganesh Mudavath
|

Updated on: Feb 26, 2023 | 9:24 AM

Share

నంద్యాల జిల్లాలో జరిగిన పరువు హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సంచలన విషయాలు తెలుస్తున్నాయి. హత్యలో ఆలమూరు గ్రామానికి చెందిన మరికొందరి ప్రమేయమున్నట్లు పోలీసులు గుర్తించారు. గ్రామానికి చెందిన ఓ పొలిటీషియన్ హస్తం ఉందని, హత్య జరిగిన తర్వాత అతని కారులోనే డెడ్ బాడీని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మృతురాలి తండ్రి దేవేంద్రరెడ్డితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని పాణ్యంలో విచారిస్తున్నారు. ఇరుకైన సందులో ఉన్న ఇంట్లో ప్రసన్న గొంతు నులిమి హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని బయటకెలా తెచ్చారు? కారులో దాదాపు 50 కి.మీ.దూరం వరకు ఎంతమంది తీసుకెళ్లారు? అక్కడ గొంతు ఎందుకు కోయాల్సి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. నంద్యాల జిల్లాలో పాణ్యం నియోజకవర్గంలో కూతురిని హత్య చేశాడు ఓ కిరాతక తండ్రి. కూతురు ప్రసన్న గొంతుకోసి చంపేశాడు. తల మొండెంను నల్లమల ఫారెస్ట్ లోని బొగడా టన్నెల్ వద్ద పడేశాడు. వివాహం చేసి సంవత్సరంన్నర అవుతున్నా కాపురానికి పోకపోవడంతో ఈ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత తండ్రి దేవేందర్ రెడ్డి అక్కడి నుంచి పరారయ్యాడు. మనవరాలు కనిపించపోవడంతో తాత శివారెడ్డి ఫిర్యాదు తో ఈ విషయం బయటకు వచ్చింది. శివారెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..