AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అమలాపురం అల్లర్ల ఘటనలో కీలక మలుపు.. తెరపైకి “అన్యం సాయి” పేరు

కోనసీమ(Konaseema) జిల్లా పేరును అంబేడ్కర్ జిల్లాగా మార్చొద్దంటూ నిరసనకారులు చేస్తున్న ఆందోళనలతో అమలాపురం అగ్నిగుండంలా మారింది. ప్రశాంతంగా ఉంటే కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం(Amalapuram) లో అల్లర్లు, హింస చెలరేగడం....

Andhra Pradesh: అమలాపురం అల్లర్ల ఘటనలో కీలక మలుపు.. తెరపైకి అన్యం సాయి పేరు
Anyam Sai
Ganesh Mudavath
| Edited By: Ravi Kiran|

Updated on: May 25, 2022 | 6:36 PM

Share

కోనసీమ(Konaseema) జిల్లా పేరును అంబేడ్కర్ జిల్లాగా మార్చొద్దంటూ నిరసనకారులు చేస్తున్న ఆందోళనలతో అమలాపురం అగ్నిగుండంలా మారింది. ప్రశాంతంగా ఉంటే కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం(Amalapuram) లో అల్లర్లు, హింస చెలరేగడం హాట్ టాపిక్ గా మారింది. ఇది ప్రభుత్వ వైఫల్యమైనని ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఆరోపిస్తుంటే ప్రభుత్వానికి మచ్చతెచ్చేందుకే ప్రతిపక్ష పార్టీలు కుట్రచేశాయని అధికార వైసీపీ(YCP) కౌంటర్ ఇస్తోంది. అయితే మంగళవారం అమలాపురంలో జరిగిన అల్లర్లలో అన్యం సాయి అనే వ్యక్తి కీలకపాత్ర పోషించాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు జనసేనకు చెందిన వ్యక్తని వైసీపీ ఆరోపిస్తుంటే వైసీపీ సానుభూతిపరుడని జన సైనికులు అంటున్నారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అమలాపురంలోని కలెక్టరేట్ ఎదుట అన్యం సాయి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో పోలీసులు అతడ్ని వెంటనే అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అతడు జనసేనకు చెందినవాడంటూ కొన్ని ఫోటోలను వైసీపీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. అయితే అన్యం సాయి అనే వ్యక్తి అమలాపురానికి చెందిన వైసీపీ నేత ఒంటెద్దు వెంకటనాయుడికి అనుచరుడిగా తెలుస్తోంది.

గతంలో వైసీపీకి చెందిన కార్యక్రమాల్లోనూ అన్యం సాయి పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత వంటి నేతలతో ఉన్న పోటోలను జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. జనసేనపై బురద జల్లేందుకు అధికార వైసీపీనే ఇలా చేస్తోందని జన సైనికులు ఆరోపిస్తున్నారు. అమలాపురం అల్లర్లపై ఇప్పటికే సోషల్ మీడియాలో వైసీపీ-జనసేన కార్యకర్తల మధ్య వార్ జరుగుతోంది. అసలు దీనంతటికీ కారణం అన్యం సాయియేనా లేదా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అమలాపురం ఆందోళనలల్లో కీలక నిందితుడైన అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ గతంలో కిరోసిన్ పోసుకుని అన్యం సాయి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతనిపై రౌడీ షీట్ వున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు.. కోనసీమలో పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ (ap dgp) కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్ష చేపట్టారు. గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్న డీజీపీ.. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 7 కేసులు నమోదు చేసినట్టుగా వెల్లడించారు.

కాగా, అన్యం సాయి ప్రస్తుతం వైసీపీ సానుభూతిపరుడని తెలుస్తోంది. గతంలో జనసేనలో ఉన్న అన్యం సాయి.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలోకి జంప్ అయ్యాడు. రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఓ అధికారి దగ్గర డ్రైవర్‌గా పని చేసే అన్యం సాయికి ఎవరో ఒకర్ని పట్టుకుని నాయకులందరితో ఫోటోలు దిగే అలవాటు ఉందని స్థానిక నేతలు చెబుతున్నారు. పార్టీలకు అతీతంగా కోనసీమ ఉద్యమం అంటూ కొద్దిరోజులుగా వాట్సాప్‌ గ్రూప్‌లలో అన్యం సాయి పోస్ట్‌లు పెడుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి