property tax: తడకల గుడిసెకు ఆస్తిపన్ను ! తడిసి మోపెడయింది..దాదాపు లక్షన్నర దాకా..!

అధిక ధరలు జనం నడివిరుస్తున్నాయి. అడ్డగోలుగా పెరిగిపోయిన ధరలతో సామాన్యుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఇక మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఏపీలో ఆస్తి పన్ను పేరుతో జనాన్ని ఎడపెడా బాదేస్తున్నారు.

property tax: తడకల గుడిసెకు ఆస్తిపన్ను ! తడిసి మోపెడయింది..దాదాపు లక్షన్నర దాకా..!
Property Tax
Follow us

|

Updated on: May 25, 2022 | 4:54 PM

అధిక ధరలు జనం నడివిరుస్తున్నాయి. అడ్డగోలుగా పెరిగిపోయిన ధరలతో సామాన్యుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఇక మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఏపీలో ఆస్తి పన్ను పేరుతో జనాన్ని ఎడపెడా బాదేస్తున్నారు. ఇకపోతే, గతంలో అద్దె ఆధారంగా ఆస్తిపన్ను వసూలు చేసేవారు. కానీ, జగన్‌ సర్కారు దానికి మార్చేసింది. నిర్మాణ విలువ ఆధారంగా ఆస్తిపన్ను నిర్ణయిస్తోంది. ఇప్పుడు నిర్మాణాల విలువ పెంపుతో… రిజిస్ట్రేషన్‌ చార్జీలతోపాటు ఏటా వసూలు చేసే ఆస్తిపన్ను కూడా పెరుగుతుంది. రివైజ్‌ చేసిన నిర్మాణాల రేట్లను జూన్‌ 1వ తేదీ నుంచి రాష్ట్రమంతా అమలు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో మున్సిపల్‌ అధికారులు విధిస్తున్న ఆస్తి పన్ను చూస్తే గుండెల్లో గుబులు రేపుతోంది. ఎందుకంటే, చిన్నపాటి గుడిసెలు, తడకల ఇళ్లకు కూడా లక్షల్లో ఆస్తిపన్ను విధిస్తున్నారు మున్సిపల్‌ అధికారులు.

అదేదో డబుల్ బెడ్‌రూం ఇల్లు కాదు…భవనం అంతకన్నా కాదు.. చుట్టూ చెక్క తడకలతో ఏర్పాటు చేసిన ఓ చిన్నపాటి టీ కొట్టు. కానీ గ్రామపంచాయతీ అధికారులు మాత్రం కనీస కనికరం లేకుండా ఈ గుడిసెకు రూ.1,33,810లు పన్ను విధించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రతీ ఒక్కరు ముక్కున లేసుకుని నివ్వెరపోతున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక వీకర్‌ సెక్షన్‌ కాలనీలోని ఓ గుడిసెకు ఒక లక్షా 33వేల, 810 రూపాయల ఆస్తి పన్ను విధించారు అధికారులు. ఇందులో అసలు 73వేల 501 రూపాయలు కాగా, దానికి వడ్డీ కింద 41వేల 383 రూపాయల ఆస్తి పన్ను చెల్లించాల్సిందిగా అధికారులు నోటీసులిచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను రూ.18,926 లు కలిపితే మొత్తం రూ.1,33,810లు చెల్లించాల్సిందేనని ఆదేశాలిచ్చారు. గుడిసెతో పాటు పక్కనే ఉన్న స్థలానికి కూడా పన్ను విధించినట్లు మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. గత ఆరేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో పెరిగిపోయిందని వివరణ ఇచ్చారు మున్సిపల్‌ అధికారులు.