Andhra Pradesh: కలకలం రేపుతున్న చిరుతపులి సంచారం.. భయంతో బిక్కుబిక్కుమంటున్న ఉత్తరాంధ్ర వాసులు

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో వన్యప్రాణుల సంచారం వణుకు పుట్టిస్తోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతాల్లో క్రూర మృగాలు కనిపిస్తుండంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నెల రోజులుగా కాకినాడ జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న పెద్దపులి...

Andhra Pradesh: కలకలం రేపుతున్న చిరుతపులి సంచారం.. భయంతో బిక్కుబిక్కుమంటున్న ఉత్తరాంధ్ర వాసులు
Leopard Wandering
Follow us

|

Updated on: Jun 26, 2022 | 12:02 PM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో వన్యప్రాణుల సంచారం వణుకు పుట్టిస్తోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతాల్లో క్రూర మృగాలు కనిపిస్తుండంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నెల రోజులుగా కాకినాడ జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న పెద్దపులి ఘటనను మరవకముందే.. శ్రీకాకుళం, అనంతపురం, ప్రకాశం జిల్లాలో ఎలుగుబంట్లు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో అధికారులు చేపట్టిన ఆపరేషన్ లో ఓ ఎలుగుబంటి మృతి చెందింది. అదే సమయంలో మరో ఎలుగుబంటి రావడంతో స్థానికులు భయపడుతున్నారు. తాజాగా అల్లూరి, విజయనగరం జిల్లా సరిహద్దులో చిరుతపులి సంచరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న (శనివారం) జీలుగుమిల్లి పంచాయతీ జిల్లా సరిహద్దు గ్రామమైన చిలకలగెడ్డ సమీపంలో ఒక గేదెపై చిరుత దాడి చేసి చంపేసింది. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతాన్ని అటవీ అధికారులు పరిశీలించారు. పులి అడుగుజాడలను తీసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. చిరుతపులి అనంతగిరి మండలం వైపు వెళ్ళినట్లుగా గుర్తించారు.

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో కనిపించిన పులి, ఇదీ ఒకటే అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చిరుతపులిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా పెద్దపులి సంచారంతో బిక్కుబిక్కుమంటున్నామని, పొలాలకు వెళ్లలేకపోతున్నామని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.

మరోవైపు.. కాకినాడలో సీసీ కెమెరాలకే పరిమితమైన పులిని ఓ వ్యక్తి చూశాడు. రౌతులపూడి మండలం యస్.పైడపాల గ్రామంలో పట్టపగలే సంచరిస్తున్న పులిని చూసి అవాక్కయ్యాడు. అప్పలనాయుడు అనే వ్యక్తి.. ఉదయం 9.30గంటల సమయంలో గేదెలను తోలుకుని సమీపంలోని గెడ్డకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి నీళ్లు తాగేందుకు పెద్దపులి రావడంతో హడలిపోయాడు. వెంటనే అప్రమత్తమై ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అడవికి చేరుకున్న అధికారులు పులి అడుగు జాడలు ఉన్నట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో