Andhra Pradesh: ఏపీ ప్రజలందరూ ఎగిరి గంతేసే వార్త.. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.2.50 లక్షలు.. సంక్రాంతి వేళ పండగే
ఏపీ ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త అందించాయి, సొంతిల్లు కట్టుకోవాలనుకునేవారికి ఉపశమనం లభించింది. పీఎం ఆవాస్ యోజన పథకం కింద దరఖాస్తులు ఇప్పటికే స్వీకరించగా.. ప్రస్తుతం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతున్నారు. ఇళ్లను ఎప్పుడు మంజూరు చేస్తారనే దానిపై క్లారిటీ వచ్చింది.

PM Awas Yojana Scheme: సొంతిల్లు కట్టుకోవాలనే ఆశ ప్రతీఒక్కరికీ ఉంటుంది. సొంతింటి కలను సాధించుకునేందుకు డబ్బులు కూడబెట్టుకుంటూ ఉంటారు. కొత్త ఇంటిని నిర్మించుకోవాలంటే లక్షలు ఖర్చవుతాయి. సామాన్యులకు ఇది భారంతో కూడుకున్నది. దీంతో సామాన్యుడి సొంతింటి కలను సాకారం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. కొన్ని పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా అమలు చేస్తోండగా.. కేంద్ర ప్రభుత్వంతో కలిసి మరికొన్ని పథకాలను రాష్ట్రాలు అమలు చేస్తోన్నాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఏపీ ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కోసం గత నెలలో ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. డిసెంబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించగా.. ఈ పథకం కింద లబ్ది పొందేందుకకు దాదాపు 60 వేల మందికిపైగా అప్లికేషన్స్ పెట్టుకున్నారు.
వచ్చే నెలలో ఇల్లు మంజూరు
దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు.. లబ్దిదారులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే జనవరిలో పూర్తి కానుండగా.. వచ్చే నెలలో అర్హులైన వారికి పీఎం అవాస్ యోజన పథకం కింద ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఇళ్లు మంజూరు అయిన తర్వాత లబ్దిదారులు నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణం సాగుతున్న కొద్ది నిధులను అకౌంట్లలో ప్రభుత్వం జమ చేస్తూ ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లబ్దిదారులకు రూ.2.5 లక్షలు మంజూరు చేయనుంది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునేవారితో స్థలం లేకుండా ఇల్లు నిర్మించుకోవాలన్నా ప్రభుత్వాం ఆర్ధిక సాయం చేస్తుంది. ప్రభుత్వమే స్థలం కేటాయించి ఇంటికి రూ.2.5 లక్షల సాయం అందించనుంది.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి..?
సీఎం ఆవాస్ యోజన పథకం కింద లబ్దిపొందాలంటే ముందుగా దరఖాస్తు పెట్టుకోవాలి. గ్రామ సచివాలయాల్లో ఉండే ఇంజినీరింగ్ సహాయకులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులతో పాటు పాటు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, ఉపాధి హామీ జాబ్ కార్డ్, ఇంటి స్థలం పత్రాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఇంటి స్థలం లేనివారు రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, ఫొటోలు అందించాల్సి ఉంటుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మీరు నిజంగా అర్హత కలిగినవారు అయితే ఇంటిని మంజూరు చేస్తారు. కాగా ఈ పథకానికి ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఇందుకోసం పీఎం ఆవాస్ యోజన వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అందులో వివరాలు పూర్తి చేసి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే రిజిస్ట్రేషన్ నెంబర్ల ఆధారంగా మీరు స్టేటస్ తెలుసుకోవచ్చు.
