AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Will Meet Kapu Leaders: త్వరలో కాపు సంక్షేమసేన ప్రతినిధులతో భేటీ కానున్న జనసేనాని.. కాపు రిజర్వేషన్‌పై చర్చించే అవకాశం

ఓ వైపు వరస సినిమాలను చేస్తున్న పవన్ కళ్యాణ్ మరోవైపు జనసేన పార్టీ కార్యకలాపాలను కూడా చూస్తున్నారు. తన వద్దకు సమస్య అంటూ వచ్చిన ప్రజలకు అండగా నిలబడుతున్నారు జనసేనాని. త్వరలో కాపు సామాజిక వర్గ ప్రజలు ఎదుర్కొంటున్న..

Pawan Will Meet Kapu Leaders: త్వరలో కాపు సంక్షేమసేన ప్రతినిధులతో భేటీ కానున్న జనసేనాని.. కాపు రిజర్వేషన్‌పై చర్చించే  అవకాశం
Surya Kala
|

Updated on: Jan 26, 2021 | 1:23 PM

Share

Pawan Meets Soon Kapusena : ఓ వైపు వరస సినిమాలను చేస్తున్న పవన్ కళ్యాణ్ మరోవైపు జనసేన పార్టీ కార్యకలాపాలను కూడా చూస్తున్నారు. తన వద్దకు సమస్య అంటూ వచ్చిన ప్రజలకు అండగా నిలబడుతున్నారు జనసేనాని. త్వరలో కాపు సామాజిక వర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో భేటీ కానున్నానని జనసేనాని పవన్ కల్యాణ్ వెల్లడించారు. కాపు కులస్తుల సమస్యలు, కాపు రిజర్వేషన్ అంశాలపై కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో చర్చించాలంటూ కాపు సంక్షేమ సేన జేఏసీ అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్య కోరారని పవన్ ఓ ప్రకటనలో తెలిపారు.

త్వరలోనే ఆ ప్రతినిధుల బృందాన్ని కలుస్తానని ఆయన స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్, కాపు కార్పొరేషన్ నిధుల వినియోగం లాంటి విషయాల్లో ఆ సామాజిక వర్గానికి ఎదురవుతున్న ఇబ్బందులు, రాష్ట్రంలో ఈ.డబ్ల్యూ.ఎస్. రిజర్వేషన్ అమలు కాకపోవడం వంటి విషయాలను ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. 72 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులందరికి జనసేన తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలను పవన్‌ తెలియజేశారు. ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని జనసేనాని కార్యకర్తలకు నేతలకు సూచించారు. ఇరు పార్టీల సమన్వయంతో వీలైనన్ని చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టి గెలవాలని జనసేన, బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Also Read: నేను కూడా రైతునే.. కేంద్ర సాగు చట్టాలను రాష్ట్రంలో అమలు చేయమన్న మహారాష్ట్ర స్పీకర్

చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ