సీఎం జగన్ రాజధానుల ప్రకటనపై.. పవన్ ట్వీట్
ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశముందన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. “తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట. అలాగా, ఇప్పటిదాక ఉన్న ఒక్క అమరావతి రాజధానికే దిక్కు దివాణం లేదు. మరి జగన్‌రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అసలు అయ్యేనా? పాలకుల వలన రాష్ట్ర విభజన మొదలుకొని.. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఒరిగిందేమీ లేదు’’ […]
ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశముందన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. “తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట. అలాగా, ఇప్పటిదాక ఉన్న ఒక్క అమరావతి రాజధానికే దిక్కు దివాణం లేదు. మరి జగన్‌రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అసలు అయ్యేనా? పాలకుల వలన రాష్ట్ర విభజన మొదలుకొని.. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఒరిగిందేమీ లేదు’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.
తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట.అలాగా ,ఒక్క అమరావతి… pic.twitter.com/dRAlZZ7OQb
— Pawan Kalyan (@PawanKalyan) December 17, 2019
కమిటీ రిపోర్ట్ రాకమునుపే ,జగన్‌రెడ్డి గారు ,మూడు రాజధానులు ప్రకటించే కాడికి , అసలు కమిటీలు వెయ్యడం దేనికి?నిపుణుల్ని అపహాస్యం చెయ్యటం దేనికి?
— Pawan Kalyan (@PawanKalyan) December 17, 2019
ప్లీనరీలో అమరావతికి ఓకే అన్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతారా?. మాట తప్పను..మడమ తిప్పను అంటే ఇదేనా?. కేంద్రం అమరావతిని గుర్తించింది. మ్యాప్ లో మార్పు చేసింది. ఏపీ నూతన రాజధానిగా కేంద్రం నోటిఫై చేయాలంటే మూడు ప్రాంతాల్లో దేన్ని నోటిఫై చేయాలి.
— Pawan Kalyan (@PawanKalyan) December 17, 2019
హై కోర్ట్ కర్నూల్ లో ఉంటే శ్రీకాకుళం నుండి కర్నూల్ కి వెళ్లాలా ? అనంతపురం నుండి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్లి ఉద్యోగాలు చేయాలా?
సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు, లేదా సెక్రటేరియట్ లో పని ఉంటే వెళ్ళటం సాధ్యమయ్యే పనేనా ?
— Pawan Kalyan (@PawanKalyan) December 17, 2019
కాగా, రాజధాని అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో జగన్ మాట్లాడుతూ.. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కారాదని, వికేంద్రీకరణ జరగాలన్నారు. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయంటూ గుర్తుచేస్తూ… ఏపీకి కూడా బహుశా మూడు రాజధానులు రావచ్చున్నారు. రాజధానిపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ.. వారం రోజుల్లోగా నివేదిక ఇస్తుందంటూ సభలో తెలిపారు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్.. కర్నూలులో హైకోర్టు, జ్యూడిషియల్ క్యాపిటల్.. విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ పెట్టొచ్చంటూ సీఎం జగన్ వెల్లడించారు.