సీఎం రాజధానుల ప్రకటన ఎఫెక్ట్‌.. చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే

ఏపీకి మూడు రాజధానులు ఉండాలన్న సీఎం జగన్ ప్రకటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంగా మారింది. అసెంబ్లీ సమావేశంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై.. విపక్షాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ నిర్ణయంపై టీడీపీ జనసేనలు తప్పుపడుతుండగా.. బీజేపీ మాత్రం స్వాగతిస్తోంది. ఇదిలా ఉంటే.. జగన్ చేసిన ఈ ప్రకటనపై టీడీపీలో విభేదాలు నెలకొన్నాయి. అమరావతి రాజధానిగా ఉండాలన్న టీడీపీ స్టాండ్‌కు భిన్నంగా జగన్ ప్రకటనను స్వాగతించారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస […]

సీఎం రాజధానుల ప్రకటన ఎఫెక్ట్‌.. చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 18, 2019 | 2:14 AM

ఏపీకి మూడు రాజధానులు ఉండాలన్న సీఎం జగన్ ప్రకటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంగా మారింది. అసెంబ్లీ సమావేశంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై.. విపక్షాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ నిర్ణయంపై టీడీపీ జనసేనలు తప్పుపడుతుండగా.. బీజేపీ మాత్రం స్వాగతిస్తోంది. ఇదిలా ఉంటే.. జగన్ చేసిన ఈ ప్రకటనపై టీడీపీలో విభేదాలు నెలకొన్నాయి. అమరావతి రాజధానిగా ఉండాలన్న టీడీపీ స్టాండ్‌కు భిన్నంగా జగన్ ప్రకటనను స్వాగతించారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. జగన్ చేసిన ప్రకటనపై గంటా శ్రీనివాస రావు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపారు. విశాఖపట్టణాన్ని పరిపాలనా నగరంగా మార్చే అవకాశముందన్న సీఎం జగన్ వ్యాఖ్యలకు ఆయన జైకొట్టారు.

సహజ సిద్ధమైన సముద్ర తీర నగరం విశాఖను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయమని కొనియాడారు. రోడ్, రైల్, ఎయిర్, వాటర్ కనెక్టివిటీ తో విశాఖ పరిపాలనా రాజధాని గా అందరి ఆశలను నెరవేర్చే నగరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. కాస్మో మెట్రో నగరం పరిపాలనా కేంద్రంగా కూడా మారితే విశ్వనగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయమని.. అందుకు విశాఖ ప్రజలు తమ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారంటూ గంటా శ్రీనివాస్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కాగా, గంటా శ్రీనివాసరావు టాపిక్ ఇప్పుడు టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది. టీడీపికి గుడ్‌బై చెప్పి.. వైసీపీ గూటికి చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. గతకొద్ది రోజులుగా పార్టీతో అంటిముట్టనట్లుగా ఉంటున్నారని.. త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుంటారన్న వార్తాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని అంశంలో సీఎం జగన్ చేసిన ప్రకటనను ఆయన సమర్థించడం ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.