Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన వాయిదా.. పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు రాజకీయాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా ? లేదా ? అనే అంశంపై క్లారిటీ రావడం లేదు. టీడీపీతో పొత్తు ఉంటుందనే విధంగా బీజేపీ జాతీయ నాయకత్వం సంకేతాలు ఇస్తున్నప్పటికీ.. సీట్ల సర్దుబాటు వ్యవహారంపై స్పష్టత వచ్చిన తరువాతే పొత్తులపై క్లారిటీ వస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు రాజకీయాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా ? లేదా ? అనే అంశంపై క్లారిటీ రావడం లేదు. టీడీపీతో పొత్తు ఉంటుందనే విధంగా బీజేపీ జాతీయ నాయకత్వం సంకేతాలు ఇస్తున్నప్పటికీ.. సీట్ల సర్దుబాటు వ్యవహారంపై స్పష్టత వచ్చిన తరువాతే పొత్తులపై క్లారిటీ వస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొన్నిరోజుల కిందట చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా హస్తిన వెళ్లి ఈ అంశంపై బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చిస్తారని ప్రచారం జరిగింది. కానీ, తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనకు బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు బ్రేక్ పడటంతో.. ఆయన విజయవాడ వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవుతారు. బీజేపీతో పొత్తు, సీట్ల పంపకం అంశంపై ఆయన చంద్రబాబుతో మంతనాలు జరుపుతారని సమాచారం.
మరోవైపు ఏపీలో పొత్తులపై రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్ఠానం సరైన టైమ్‌లో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆమె అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్తామని తెలిపారు. పొత్తులపై ఆధారపడి తాము ఏ కార్యక్రమాలూ చేపట్టబోమని.. పార్టీ బలోపేతం కోసమే తమ ప్రయత్నాలు ఉంటాయని అన్నారు. ముందు తమ ప్రయత్నాలన్నీ బీజేపీ బలోపేతం కోసమేనంటూ వివరించారు.
పొత్తులపై బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈసారి అవ్వ కావాలి.. బువ్వ కావాలి అంటే కుదరకపోవచ్చని కామెంట్ చేశారు. టీడీపీ అన్ని అంశాలపై పూర్తి స్పష్టతతో ఎన్డీఏలో చేరాల్సి ఉంటుందన్నారు. ఏరు దాటాక కూడా నావతోనే పయనం చేయాల్సి ఉంటుందని ఐవైఆర్ కృష్ణరావు వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..