AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: శక్తివంతమైన గ్రహాల కలయిక.. ఈ రాశులవారికి గుడ్ టైమ్ స్టార్ట్, ఏది చేసినా..

Venus Sun Saturn conjunction: 2026 మార్చి 2న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అనంతరం మార్చి 15న సూర్యుడు కూడా మీనరాశిలోకి చేరతాడు. ఇప్పటికే అక్కడ శని సంచరిస్తున్నాడు. ఫలితంగా మూడు ప్రధాన గ్రహాల శక్తివంతమైన కలయిక ఏర్పడుతుంది. ఈ గ్రహాల కలయిక కొన్ని రాశులకు అదృష్టాన్ని తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.

Zodiac Signs: శక్తివంతమైన గ్రహాల కలయిక.. ఈ రాశులవారికి గుడ్ టైమ్ స్టార్ట్, ఏది చేసినా..
Rashifal
Rajashekher G
|

Updated on: Feb 16, 2026 | 10:46 AM

Share

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి నెలా గ్రహాల సంచారంలో మార్పులు టుచేసుకుంటుంటాయి. కొన్నిసార్లు రెండు లేదా మూడు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు ప్రత్యేకమైన సంయోగాలు ఏర్పడతాయి. 2026 మార్చి నెలలో కూడా అలాంటి శక్తివంతమైన గ్రహ కలయిక కనిపించబోతోంది. ముఖ్యంగా శుక్రుడు, సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల ఒక విశేష యోగం ఏర్పడుతుంది. ఇప్పటికే మీనరాశిలో శని సంచరిస్తుండటంతో సూర్య, శుక్ర, శనుల త్రిగ్రహ సంయోగం ఏర్పడనుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ కలయిక కొన్ని రాశుల వారికి శుభఫలితాలు అందించవచ్చు.

శుక్ర–సూర్య–శని త్రిగ్రహ సంయోగం

2026 మార్చి 2న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అనంతరం మార్చి 15న సూర్యుడు కూడా మీనరాశిలోకి చేరతాడు. ఇప్పటికే అక్కడ శని సంచరిస్తున్నాడు. ఫలితంగా మూడు ప్రధాన గ్రహాల శక్తివంతమైన కలయిక ఏర్పడుతుంది. అదేవిధంగా సూర్యుడు–శుక్రుడు కలిసే సందర్భంలో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి సంయోగం రావడం విశేషంగా భావిస్తున్నారు. ఈ త్రిగ్రహ సంయోగం వల్ల ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి అనుకూల ఫలితాలు లభించే అవకాశముంది:

1. వృషభ రాశి

మార్చి నెల వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరగడం, కొత్త అవకాశాలు రావడం జరుగవచ్చు. బాధ్యతలు పెరిగినా గౌరవం, గుర్తింపు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.

2. సింహ రాశి

సింహ రాశి వారికి ఈ కాలం ఉత్సాహభరితంగా ఉండొచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా, కృషికి తగిన ఫలితం లభిస్తుంది. దాంపత్య జీవితంలో అనుబంధం బలపడుతుంది. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది.

3. ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉండే సమయం ఇది. కెరీర్‌లో పురోగతి కనిపించవచ్చు. కొత్త అవకాశాలు దక్కే అవకాశం ఉంది. ఆర్థికంగా మెరుగైన స్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. సానుకూల మార్పులు జీవితం లో కనిపించవచ్చు.

4. మకర రాశి

మకర రాశి వారికి ఇది శుభకాలంగా భావించవచ్చు. ఉద్యోగ మార్పు లేదా పదోన్నతి అవకాశాలు రావచ్చు. ఇంతకాలం ఉన్న ఒత్తిడులు తగ్గే సూచనలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషం పెరుగుతుంది. కొత్త ప్రారంభాలకు ఇది అనుకూల సమయంగా ఉండొచ్చు. అయితే, జ్యోతిష ఫలితాలు వ్యక్తిగత జన్మకుండలి ఆధారంగా మారవచ్చు. ఇవి సాధారణ రాశి ఫలితాల ఆధారంగా ఇచ్చిన సూచనలు మాత్రమే.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)