AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీపై మాజీ మంత్రి జిల్లా అధికారులతో సమీక్ష..

ఒంగోలులో 25 వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేస్తుంటే అవినీతికి పాల్పడుతున్నట్టు ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను అవినీతికి పాల్పడినట్టు తేలితే తనను చెప్పుతో కొట్టాలని ఆవేశంతో అన్నారు. అలాగే పేదలకు పట్టాలు పంపిణీ చేయకుండా ప్రయత్నిస్తే వారి సంగతి తేలుస్తానన్నారు.

AP News: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీపై మాజీ మంత్రి జిల్లా అధికారులతో సమీక్ష..
Former Minister Balineni Sr
Fairoz Baig
| Edited By: |

Updated on: Feb 11, 2024 | 2:10 PM

Share

ఒంగోలులో 25 వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేస్తుంటే అవినీతికి పాల్పడుతున్నట్టు ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను అవినీతికి పాల్పడినట్టు తేలితే తనను చెప్పుతో కొట్టాలని ఆవేశంతో అన్నారు. అలాగే పేదలకు పట్టాలు పంపిణీ చేయకుండా ప్రయత్నిస్తే వారి సంగతి తేలుస్తానన్నారు. ఒంగోలులో 231 కోట్లతో పేదలకు 25 వేల పట్టాలు పంపిణీ చేయడం కోసం అధికారులతో ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు. అగ్రహారం దగ్గర లే అవుట్‌ను పరిశీలించారు.

పేదల పట్టాల పంపిణీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలు పంపిణీ చేయలేకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని భీష్మించానని, తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్నానని తెలిపారు. పట్టాలు పంపిణీ చేయడాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారి ఆఫీసును 75వేల మంది లబ్దిదారులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా ఫర్వాలేదన్నారు. సీఎం ఊరుకున్నా, తాను ఊరుకోనని తెలిపారు. ఈనెల 20 నుంచి 25వ తేది లోపు సీఎం చేతుల మీదుగా 25 వేలమందికి పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. పట్టాలతో పాటు ఇళ్ళ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గేటెడ్‌ కమ్మూనిటీ టౌన్‌ షిప్‌లా అభివృద్ది చేస్తామని బాలినేని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూపాయి కూడా ఖర్చు చేయకుండా మీ ఇంటి వాస్తు దోషాలకు చెక్..
రూపాయి కూడా ఖర్చు చేయకుండా మీ ఇంటి వాస్తు దోషాలకు చెక్..
ప్యాకెట్‌ పాలలో ప్రమాదకర కోలిఫామ్ బాక్టీరియా వీడియో
ప్యాకెట్‌ పాలలో ప్రమాదకర కోలిఫామ్ బాక్టీరియా వీడియో
ఏపీ ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త
ఏపీ ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త
పూరి బీచ్‌లో వెలసిన మహా శివుడు!17,000 రుద్రాక్షలతో అద్భుతమైన రూపం
పూరి బీచ్‌లో వెలసిన మహా శివుడు!17,000 రుద్రాక్షలతో అద్భుతమైన రూపం
ఇవాళే జేఈఈ మెయిన్ 2026 ఫలితాలు.. మీ స్కోర్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్
ఇవాళే జేఈఈ మెయిన్ 2026 ఫలితాలు.. మీ స్కోర్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్
లాస్ట్ మ్యాచ్ ఆడేసిన పాక్ స్టార్ ప్లేయర్.. కెరీర్ క్లోజ్..?
లాస్ట్ మ్యాచ్ ఆడేసిన పాక్ స్టార్ ప్లేయర్.. కెరీర్ క్లోజ్..?
‘షట్‌డౌన్ చేస్తే చంపేస్తా’.. ఇంజినీర్‌కు ‘ఏఐ’ బెదిరింపు!
‘షట్‌డౌన్ చేస్తే చంపేస్తా’.. ఇంజినీర్‌కు ‘ఏఐ’ బెదిరింపు!
శ్రీశైలం శివయ్యకు చెవిటి మల్లన్న అనే పేరు ఎందుకొచ్చిందంటే..?
శ్రీశైలం శివయ్యకు చెవిటి మల్లన్న అనే పేరు ఎందుకొచ్చిందంటే..?
పెళ్లికాని ప్రసాదులూ గెట్ రెడీ.. మూఢం ముగిసింది.. వెడ్డింగ్ టైమ్
పెళ్లికాని ప్రసాదులూ గెట్ రెడీ.. మూఢం ముగిసింది.. వెడ్డింగ్ టైమ్
ఈ గుడికి కాపాలాగా మొసళ్లు..పండ్లు, స్వీట్లు తింటూ భక్తులతో స్నేహం
ఈ గుడికి కాపాలాగా మొసళ్లు..పండ్లు, స్వీట్లు తింటూ భక్తులతో స్నేహం