Tirumala: తిరుపతి ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల నిరసన.. ఆఖరి క్షణంలో ఇదేంపనంటూ..

ఈ మేరకు ప్రయాణానికి సిద్ధమైన ప్రయాణికులు ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ఆలయన్స్ విమానంలో ప్రయాణించాల్సిన ప్యాసింజర్స్ ఉదయమే ఎయిర్పోర్ట్ కు చేరుకున్నా అక్కడ అలయన్స్ యాజమాన్యం ఎవరు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.

Tirumala: తిరుపతి ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల నిరసన.. ఆఖరి క్షణంలో ఇదేంపనంటూ..
Passengers Trouble

Edited By:

Updated on: Nov 12, 2024 | 12:58 PM

తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసు రద్దుతో ఆందోళనకు దిగారు 48 మంది ప్రయాణికులు. హైదరాబాదు నుంచి తిరుపతికి రావలసిన విమాన సర్వీసు రద్దు కాగా ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమాన సర్వీసు రద్దు చేసి ప్రత్యామ్నయం చూపక పోవడంపై ప్రయాణికుల నిరసనకు వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం 7 :15 గంటలకు తిరుపతికి రావలసిన విమానం, తిరిగి 8:15 గంటలకు హైదరాబాద్‌ తిరిగి వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు ప్రయాణానికి సిద్ధమైన ప్రయాణికులు ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ఆలయన్స్ విమానంలో ప్రయాణించాల్సిన ప్యాసింజర్స్ ఉదయమే ఎయిర్పోర్ట్ కు చేరుకున్నా అక్కడ అలయన్స్ యాజమాన్యం ఎవరు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.

ఇక్కడ క్లిక్ చేయండి..

విమాన సర్వీసు రద్దు అయిన విషయం తెలుసుకున్న ప్రయాణికులు అక్కడి అధికారులను నిలదీశారు. ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఎలాంటి ప్రత్యామ్నయం చూపకుండా టికెట్ అమౌంట్ రిఫండ్ పై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అక్కడే బైఠాయించారు. దాదాపు రెండు గంటలకు పైగా ఆందోళన చేసిన ప్రయాణికుల ఖాతాలకు అమౌంట్ రిఫండ్ చేస్తామన్న హామీ రావడంతో ఎట్టకేలకు ప్యాసింజర్స్ అక్కడి నుంచి వెనుతిరిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి