Rain Alert: ముంచుకొస్తున్న మరో గండం.! రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం.

Rain Alert: ముంచుకొస్తున్న మరో గండం.! రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం.

Anil kumar poka

|

Updated on: Nov 12, 2024 | 11:16 AM

ఏపీని వరుణుడు వీడనంటున్నాడు. నైరుతీ బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో ఏపీలో పలుచోట్ల వర్షం పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతీ బంగాళాఖాతంలో ఆవర్తనం క్రమంగా బలపడి.. అల్పపీడనంగా మారింది. దాని ప్రభావం వల్ల ఇప్పటికే ఏపీలో గాలులు వేగంగా ఉన్నాయి. దాని వల్ల ఏపీలో3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ అధికారులు తెలిపారు.

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.6 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది దాదాపు పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వచ్చే 2 రోజుల్లో నెమ్మదిగా కదలుతుంది. తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి.. నైరుతి బంగాళాఖాతం మీదుగా పై ఉపరితల అవర్తనం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లమీ ఎత్తులో కొనసాగుతోంది. వచ్చే మూడు రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడి వర్షం పడనుందని అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.