ఇలాంటి టూరిస్ట్ ప్లేస్ మరెక్కడైనా చూపిస్తే .. లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్!

Papikondalu: దీపావళి సెలవులకు విహార యాత్రకు వెళ్లాలని అని అనుకుంటున్నారా? అది కూడా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని అని అనుకుంటున్నారా? అయితే పాపికొండులు పిలుస్తున్నాయి. పాపికొండల విహార యాత్ర మళ్లీ ప్రారంభమైంది. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో పాపికొండలు విహార యాత్ర మొదలైంది.

ఇలాంటి టూరిస్ట్ ప్లేస్ మరెక్కడైనా చూపిస్తే .. లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్!
Papikondalu
Follow us

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 30, 2024 | 10:33 AM

దీపావళి సెలవులకు ముందు పాపికొండల విహార యాత్ర మళ్లీ ప్రారంభమైంది. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో పాపికొండలు విహార యాత్ర మొదలైంది. నాలుగు నెలల తర్వాత మళ్ళీ పాపికొండలు విహార యాత్ర స్టార్ట్‌ కావడంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులు బోట్‌లో షికార్లు చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సందడి మధ్య టూరిస్టులు తొలి రోజు పాపికొండల విహార యాత్ర కొనసాగించారు. పర్యాటకులు తరలి రావడంతో గండి పోచమ్మ పరివాహక ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. తొలి రోజు 41 మందితో కావేరి బోట్ పాపికొండలు విహార యాత్రకు వెళ్లింది.

లైఫ్ జాకెట్లతో పాటు ప్రత్యేక తనిఖీలు తర్వాత పర్యాటక శాఖ అధికారులు బోట్‌కు అనుమతిచ్చారు. ఈ క్రమంలోనే పాపికొండలు పర్యటనకు 15 బోట్లకు ఫిట్నెస్, లైసెన్స్‌ ఇచ్చారు. పాపికొండల టూర్‌కు అనుమతి ఇవ్వడంతో సబ్ కలెక్టర్ కల్పశ్రీతో పాటు స్థానిక అధికారులు బోట్లను పరిశీలించారు. బోట్ల ఫిట్‌నెస్‌, లైసెన్స్‌ రికార్డులను వెరిఫై షికారు చేశారు. ఈ సందర్భంగా టూర్‌కు వెళ్ళే సమయంలో ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన చర్యలుపై ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. పాపికొండల టూర్‌కు వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బోట్ల యజమానులకు ఆమె సూచించారు. ఒకవేళ పర్యాటకుల నుండి ఫిర్యాదులు వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..