AP News: ఏపీలోని దేవాలయాల్లో కీలక మార్పులు.. ప్రతి ఆలయంలో ఫిర్యాదుల బాక్స్
దేవాలయాల్లో కీలక మార్పులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆలయాల్లో నెయ్యి వాడకంపై కమిటీ ఏర్పాటుతోపాటు.. ప్రతి ఆలయంలో ఫిర్యాదుల బాక్స్ పెట్టేందుకు నిర్ణయించింది. ఆ డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం...
తిరుమల లడ్డూ కల్తీ వివాదం తర్వాత ఏపీలోని ఆలయాల్లో సమూల మార్పులకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేవాలయాల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రధానంగా.. ఆలయాల్లో నెయ్యి వాడకంపై ఉన్నత కమిటీ ఏర్పాటు చేస్తున్నామని.. ప్రతి డిపార్ట్‌మెంట్ నుండి అధికారులను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. 15 రోజుల్లో కమిటీ నివేదిక ఇస్తుందని.. ఆ నివేదిక ఆధారంగా నెయ్యి వాడకంపై నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి ఆనం.
అలాగే.. ప్రతి ఆలయంలో ఫిర్యాదుల కోసం బాక్స్‌తో పాటు, భక్తులు మొబైల్ నెంబర్లకు కూడా ఫిర్యాదు చేసేలా కీలక మార్పులు చేస్తామన్నారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ప్రముఖ ఆలయాల్లో కచ్చితమైన నిబంధనల, నియమాలు అనుసరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రతి ఆలయంలో వేద సభలు జరపాలని.. సామాన్యులకు కూడా హిందూ ధర్మం, పాండిత్యం తెలిసేలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా.. కొన్ని జిల్లాల్లో వేద సభలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు మంత్రి ఆనం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..