AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రాష్ట్రంలో 5 జిల్లాల్లో… 54 మండలాల్లో కరువు పరిస్థితులు

ఏపీ సర్కార్ 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కరవు మండలాల లిస్ట్ విడుదల చేసింది. 5 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో అధిక వర్షపాతం నమోదైనా.. సగటు వర్షపాతాన్ని పరిగణలోకి తీసుకుని ఈ వివరాలు వెల్లడించింది.

Andhra Pradesh: రాష్ట్రంలో 5 జిల్లాల్లో... 54 మండలాల్లో కరువు పరిస్థితులు
Andhra Drought Mandals
Ram Naramaneni
|

Updated on: Oct 30, 2024 | 8:50 AM

Share

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో రాయలసీమ పరిధిలోని 5 జిల్లాల్లో 54 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. నైరుతి ఋతుపవనాలు సీజన్లో (జూన్ -సెప్టెంబర్) రాష్ట్ర సాధారణ వర్షపాతం 574.7మిమీ ఉండగా 681.6మిమీ వర్షపాతం నమోదైందన్నారు. అయినప్పటికి కొన్ని మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, డ్రై స్పెల్ నమోదైందన్నారు.

కేంద్ర వ్యవసాయ శాఖ కరువు మాన్యువల్ ప్రకారం రెండు మ్యాన్డేటరీ సూచికలు ( వర్షపాతం, డ్రై స్పెల్), నాలుగు ఇంపాక్ట్ సూచికలు ( వ్యవసాయ క్రాప్ ఏరియా, రిమోట్ సెన్సింగ్, సాయిల్ మోయిస్చర్, హైడ్రాలజీ), క్షేత్రస్థాయిలో వాస్తవాలతో కూడిన జిల్లా కలెక్టర్ నివేదిక (పంట నష్టం 33%…. అంతకంటే ఎక్కువ) నియమాల ప్రకారం… ఖరీఫ్-2024లో 27 మండలాల్లో తీవ్ర కరువు, 27 మండలాల్లో మధ్యస్థ కరువు ప్రకటించినట్లు తెలిపారు.

కర్నూలు -2, అనంతపురం-7, శ్రీసత్యసాయి-10, అన్నమయ్య-19, చిత్తూరు-16 మండలాల్లో కరువు ప్రకంటించడం జరిగిందన్నారు. క్రింది మండలాలు కరువు మండలాలుగా ప్రకటించినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వివరించారు.

1. కర్నూలు(02) :- కౌతాళం, పెద్దకడుబూరు (02 మధ్యస్థ కరువు మండలాలు)

2. అనంతపురం(07) :- నార్పల, అనంతపురం(02 తీవ్ర), విడపనకల్లు, యాడికి,గార్లెదిన్నె,బీకే సముద్రం,రాప్తాడు ( 05 మధ్యస్థ కరువు మండలాలు)

3. శ్రీసత్యసాయి(10) :- తాడిమర్రి, ముదిగుబ్బ, తలుపుల(3 తీవ్ర), కనగానిపల్లి, ధర్మవరం, నంబులపూలకుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, రామగిరి, పరిగి ( 07 మధ్యస్థ కరువు మండలాలు)

4. అన్నమయ్య (19):- గాలివీడు,చిన్నమండె, సంబేపల్లి,టి.సుందరపల్లె,రాయచోటి,లక్కిరెడ్డిపల్లె, రామాపురం, వీరబల్లె, తంబళ్లపల్లె, గుర్రంకొండ, కలకాడ, పీలేరు,కలికిరి, వాల్మీకిపురం,కురబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి.కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపల్లె( 19 తీవ్ర కరువు మండలాలు)

5. చిత్తూరు(16) :- పెనుమూరు,యాదమరి, గుడిపాల(3 తీవ్ర), శ్రీరంగరాజపురం, చిత్తూరు, శాంతిపురం, రొంపిచర్ల, పూతలపట్టు, సోమల, పుంగనూరు, పలమనేరు, బైరెడ్డిపల్లి, వెంకటగిరికోట, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం( 13 మధ్యస్థ కరువు మండలాలు)

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ
టెన్త్ స్టూడెంట్స్‌కు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు..
టెన్త్ స్టూడెంట్స్‌కు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు..
ఫుల్‌గా తాగి పట్టాలపై ఆటో పార్క్‌ చేసిన డ్రైవర్.. కాసేపటికే
ఫుల్‌గా తాగి పట్టాలపై ఆటో పార్క్‌ చేసిన డ్రైవర్.. కాసేపటికే
రికార్డు సెంచరీతో గంభీర్, అగార్కర్‌లకు ఇచ్చిపడేసిన రోహిత్..
రికార్డు సెంచరీతో గంభీర్, అగార్కర్‌లకు ఇచ్చిపడేసిన రోహిత్..