AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగినితో సహజీవనం.. ఫోన్ మాట్లాడుతుండంగానే కట్ అయింది.. ఆ తర్వాత హోంగార్డు అలా..

పల్నాడు జిల్లాలో హోంగార్డు షేక్ అలేఖ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. కారంపూడి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించే ఆయన ముళ్ల పొదల్లో శవమై కనిపించారు. సోదరితో ఫోన్‌లో మాట్లాడుతుండగానే కాల్ కట్ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. సహజీవనం చేస్తున్న మహిళతో విభేదాలు ఉన్నాయా? హత్య జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్యోగినితో సహజీవనం.. ఫోన్ మాట్లాడుతుండంగానే కట్ అయింది.. ఆ తర్వాత హోంగార్డు అలా..
Home Guard Death
T Nagaraju
| Edited By: |

Updated on: Nov 16, 2026 | 10:34 AM

Share

పల్నాడు జిల్లా కారంపూడిలో హోంగార్డుగా పనిచేస్తున్న వ్యక్తి ముళ్ల పొదల్లో శవమై కనిపించాడు. శరీరంపై గాయాలుండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూడు రోజుల పాటు సెలవులో ఉన్న హోంగార్డు ఆదివారం రోజు చర్లగుడిపాడు.. జంగమహేశ్వరపురం మధ్య గల జానపాడు దర్గా వద్ద అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వివరాల ప్రకారం..

గురజాల మండలం చర్లగుడిపాడుకు చెందిన షేక్ అలేఖ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కారంపూడి పిఎస్ లో విధులు నిర్వహించే హోంగార్డు మూడు రోజుల పాటు సెలవు పెట్టాడు. మృతుడికి వివాహం అయింది. ఇద్దరూ పిల్లలున్నారు. అయితే ఏడేళ్లుగా గురజాలకు చెందిన ఒక ఉద్యోగినితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే శనివారం వాకింగ్ కు వెళ్లి వస్తానని చెప్పిన అలేఖ చర్లగుడిపాడు నుండి గురజాల ఆమె ఇంటికే వెళ్లినట్లు తెలుస్తుంది. సాయంత్రం ఇంట్లో నుండి వెళ్లిన అలేఖ తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు అనుమానం వచ్చింది. ఆదివారం దర్గా పరిసర ప్రాంతాల్లో మృతదేహం ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం అలేఖదిగా తేల్చారు.

అయితే, సాయంత్రం వాకింగ్ సమయంలో సోదరితో ఫోన్ మాట్లాడుతుండగానే మాటలు ఆగిపోయాయని ఆమె పోలీసులు చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సహజీవనం చేస్తున్న మహిళతో ఏమైనా విబేధాలున్నాయా.. హత్య చేసి పడేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సుదీర్ఘ కాలం పిఎస్ లో పనిచేస్తున్న హోంగార్డు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో హత్య చేశారా లేక ఇంకేదైనా కారణం ఉందా అన్నది పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది.

Follow Us