Srisailam: శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ఇక పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ ద్వారా టికెట్లు ప్రారంభం
శ్రీశైలం మహాక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల అన్ని ఆర్జిత సేవలకు ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందే విధానాన్ని ఈవో ఎస్.లవన్న మంగళవారం ఆవిష్కరించారు. పరిపాలన భవనంలో ఆన్‌లైన్‌లో పూర్తిస్థాయి టికెట్ల జారీని లాంఛనంగా ప్రారంభించారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల అన్ని ఆర్జిత సేవలకు ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందే విధానాన్ని ఈవో ఎస్.లవన్న మంగళవారం ఆవిష్కరించారు. పరిపాలన భవనంలో ఆన్‌లైన్‌లో పూర్తిస్థాయి టికెట్ల జారీని లాంఛనంగా ప్రారంభించారు. అలాగే మే నెలకు సరిపడా టికెట్లను అప్‌లోడ్ చేశారు. ప్రతిరోజూ మూడు పూటల పాటు జరిగే అభిషేకం టికెట్లను సైతం జారీ చేశారు. గర్భాలయ అభిషేకం టికెట్లు 100, సామూహిక అభిషేకానికి 750, మల్లికార్జునస్వామి స్పర్శదర్శనం -1,575, అమ్మవారి కుంకుమార్చన – 400, రుద్రహోమం – 60, చండీహోమం – 60 టికెట్లు విడుదల చేశారు.
అలాగే స్వామి, అమ్మవార్ల కల్యాణానికి సంబంధించిన 95 టికెట్లతోపాటు ఇతర సేవలవీ కూడా ఆన్‌లైన్‌లో ఇవ్వనున్నట్లు ఈవో లవన్న తలిపారు. దర్శనానికి వచ్చే భక్తులు ఆన్‌లైన్‌లో పొందిన టికెటు హార్డ్‌కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్‌ను వెంట తెచ్చుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆలయం వద్ద ఉన్న కరెంట్ బుకింగ్ ఆర్జిత సేవా టికెట్ల జారీని పూర్తిగా నిలిపివేసినట్లు చెప్పారు. భక్తులు www.srisailadevasthanam.org, www.aptemples.gov.in ద్వారా ఈ టికెట్లని పొందాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం