AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రూపాయి నోటుతో జనసేన ఎంట్రీ పాసు.. ఫేక్ పాస్‌ల కట్టడికి నేతల ఎత్తుగడ

రూపాయి నోటు ఎవరైనా చూశారా...కాయన్ కనిపిస్తున్నా నోట్ మాత్రం అరుదుగా చెలామణిలో ఉంటుంది. అయితే ఇవి ఆకస్మికంగా తణుకు నియోజకవర్గంలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో ఎంట్రీ పాస్‌ల రూపంలో కనిపించాయి.

Andhra Pradesh: రూపాయి నోటుతో జనసేన ఎంట్రీ పాసు.. ఫేక్ పాస్‌ల కట్టడికి నేతల ఎత్తుగడ
One Rupee Note
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jul 13, 2023 | 9:43 PM

Share

రూపాయి నోటు ఎవరైనా చూశారా…కాయన్ కనిపిస్తున్నా నోట్ మాత్రం అరుదుగా చెలామణిలో ఉంటుంది. అయితే ఇవి ఆకస్మికంగా తణుకు నియోజకవర్గంలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో ఎంట్రీ పాస్‌ల రూపంలో కనిపించాయి. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా కార్యకర్తలు సమావేశాలను నియోజకవర్గాల వారిగా నిర్వహిస్తున్నారు. అయితే వీటిలో పాల్గొనే వారికి ఎంట్రీ పాస్ తప్పనిసరిగా మారింది. అభిమానులను నియంత్రించేందుకు పాస్‌లు తప్పని సరి అని జనసేన నేతలు భావించటంలో తప్పు లేదు కాని ఒక రాజకీయ పార్టీ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే సమావేశాలకు ప్రత్యేక పాస్ జారీ చేయటం నూతన పరిణామంగా పలువురు చూస్తున్నారు.

ఇక ప్రత్యర్థి పార్టీలయితే జనసేన పొలిటికల్ మీటింగ్ లు సైతం సినిమా ఫంక్షన్ల మాదిరిగా నిర్వహిస్తున్నాయని విమర్శిస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే ప్రైవేటు సెక్యూరిటీ, బౌన్సర్లును పెట్టి నియంత్రిస్తున్నా కార్యకర్తలు కట్టడి మాత్రం సాధ్యం కావటంలేదు. సమావేశం జరిగే హాలు లో సిట్టింగ్ కెపాసిటీకి మించి ఎంట్రీ పాస్ ల జారీ ఈ గందరగోళంకు దారి తీస్తుంది. ఈ క్రమంలోనే ఏలూరు జరిగిన సమావేశంలో ఫంక్షన్ హాలు అద్దాలు పగిలిపోయాయి. మరోవైపు ఇక్కడే మరో విషయం వెలుగులోకి వచ్చింది. పార్టీ నాయకులు ఇస్తున్న పాస్‌లు కలర్ జిరాక్స్ లు తీయించుకుని రావటం కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి. ఇవన్నీ అనుభవాలు గా భావించిన జనసేన నేతలు తణుకులో రూటు మార్చారు.

ఇవి కూడా చదవండి

రూపాయి నోటును పాసుగా జారీ చేశారు. స్థానిక కమ్మ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశానికి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను ఆహ్వానించారు. అయితే ఈ సమావేశానికి హాజరయ్యే వారికి వినూత్నంగా అరుదుగా ప్రస్తుతం దొరుకుతున్న రూపాయి నోటుపై జనసేన స్టాంపు వేసి అందచేశారు. అయితే నోట్లపై ఇలా స్టాంపులు వేస్తే తర్వాత మార్కెట్ లో మారకం విషయం లో ఇబ్బందులు తలెత్తుతాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఫేక్ పాస్ తలపోటు వదిలించుకోవటానికి భవిష్యత్తులో ఇంకా ఎన్ని మార్గాల్లో జనసేన నేతలు చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇంత చేసినా పాస్ ఉన్నవారు లోపలకు వెళ్లలేకపోవటంతో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు.