AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రెండు రూపాయలకే ఇడ్లీలు.. పేదల పాలిట అన్నపూర్ణగా మారిన డెబ్భై ఏళ్ల బామ్మ..

కరోనా దేశాన్ని అల్లకల్లోలం చేసింది. ఆర్ధిక మాంధ్యంలోకి తీసుకువెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. ఇంధన ధరలే కాకుండా నిత్యావసర సరకుల ధరలు కూడా రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో...

Andhra Pradesh: రెండు రూపాయలకే ఇడ్లీలు.. పేదల పాలిట అన్నపూర్ణగా మారిన డెబ్భై ఏళ్ల బామ్మ..
Idly Dosa Old Woman
Ganesh Mudavath
|

Updated on: Nov 04, 2022 | 6:30 PM

Share

కరోనా దేశాన్ని అల్లకల్లోలం చేసింది. ఆర్ధిక మాంధ్యంలోకి తీసుకువెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. ఇంధన ధరలే కాకుండా నిత్యావసర సరకుల ధరలు కూడా రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో సామాన్యుడి జీవనం ప్రశ్నార్థకంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఓ వృద్ధురాలు అతి తక్కువ ధరకే ఇడ్లీ, దోశలు విక్రయిస్తూ పేదలపాలిట అన్నపూర్ణగా నిలిచింది. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బండగేరికి గ్రామంలో వెంకటలక్ష్మి అనే 70 ఏళ్ల వృద్ధురాలు నివాసముంటోంది. ఆమె దాదాపు 28 ఏళ్ల నుంచి ఇడ్లీలు, దోశలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. రోజులు మారినా కట్టెల పొయ్యిని వీడకుండా ఏడు పదుల వయసులోనూ ఎంతో ఓపికతో దోశలు, ఇడ్లీలు వేస్తూ అందరి ఆకలి తీరుస్తోంది. రెండు ఇడ్లీలు తినాలంటే 30 రూపాయలు చెల్లిస్తున్న ఈ రోజుల్లో కూడా లాభాపేక్ష లేకుండా పొరుగువారికి సాయపడటమే లక్ష్యంగా ఒక ఇడ్లీ కేవలం రెండు రూపాయలకే అమ్ముతోంది. కేవలం పది రూపాయలకు 3 దోశలు ఇస్తూ అనేకమంది ఆకలి తీరుస్తోంది.

నిత్యావసర సరకుల ధరలు పెరిగినా ఈ బామ్మ చేసే టిఫిన్‌ ధరలో కానీ, రుచిలోకానీ మార్పు లేదు. తెలవారుతుండగానే స్థానికులు బామ్మ పెట్టే వేడి వేడి ఇడ్లీ, దోశల కోసం క్యూ కడతారు. గతంలో అయితే రూపాయికే నాలుగు ఇడ్లీలు, నాలుగు దోశలు పెట్టేది. అయితే ఆ వచ్చే డబ్బు పెట్టుబడికి సరిపోకపోవడంతో స్వల్పంగా ధర పెంచింది. అదికూడా మరింత మందికి ఆహారం అందించవచ్చనే ఉద్దేశంతోనే. అల్పాదాయ వర్గాలకు చెందిన ఎందరో ఆకలి తీర్చుతున్న ఈ బామ్మను ఎప్పుటికీ మరువలేమంటున్నారు. కాగా ఈ బామ్మకు కుమారుడు, కోడలు ఉన్నారు. సొంత ఇల్లు కూడా లేదు, అద్దె ఇంటిలోనే జీవనం సాగిస్తున్నారు. బామ్మకు వచ్చే 2,500 రూపాయల పెన్షన్‌తో పాటు, ఈ చిరు వ్యాపారంతో వచ్చే చిన్న పాటి ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

Idly Dosa Woman

Idly Dosa Woman

సొంతిల్లు కట్టుకునేందుకు పునాదులు వేసుకున్నా చాలినంత డబ్బు లేకపోవడంతో ఆ ఇల్లు ఆక్కడితో ఆగిపోయింది. ప్రభుత్వం సహాయం అందిస్తే ఇంటిని నిర్మించుకుంటానంటోంది ఈ బామ్మ. సొంత ఇల్లు లేక అవస్థలు పడుతున్నాం. తక్కువ ధరకే దోశలు, ఇడ్లీలు విక్రయిస్తూ పేదల ఆకలి తీర్చటం ఆనందంగా ఉందంటున్న ఈ బామ్మకు ప్రభుత్వం సాయం చేసి ఆదు కోవాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..