Pawan Kalyan: ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మూడు రాజధానుల విషయం, కాపుల అంశం, జనసేన నేతలపై విమర్శలు.. ఇలా అన్ని రకాలుగా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. జనసేన అధినేత..
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మూడు రాజధానుల విషయం, కాపుల అంశం, జనసేన నేతలపై విమర్శలు.. ఇలా అన్ని రకాలుగా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రులు, వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించారు. కూల్చివేతలతో పరిపాలన ప్రారంభించిన వైసీపీ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చివేయటాన్ని తీవ్రంగా ఖండించిన జన సేనాని.. ప్రభుత్వం కక్ష కట్టి, ప్రజలను వేధిస్తోందని మండిపడ్డారు. ఓటు వేయనివారిని వైసీపీ నేతలు శత్రువులుగా చూస్తున్నారని ఆక్షేపించారు. వైసీపీ ఓట్లేసిన 49.95 శాతం మందికి మాత్రమే పాలకులం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటం గ్రామంలో ఇప్పటికే 70 అడుగుల రోడ్డు ఉందన్న పవన్ కల్యాణ్.. 120 అడుగుల రోడ్లు వేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఇళ్ల కూల్చివేత నోటీసులపై బాధితులు ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. ఉదయం నుంచి పోలీసు బందోబస్తు సహాయంతో జేసీబీలతో ఇళ్లు కూల్చి వేస్తున్నారు. రోడ్డు పక్కనే ఉన్న మంచి నీటి ట్యాంక్ ను వదిలి, దాని పక్కన ఉన్న ఇంటిని కూలగొట్టారు. ఇదేమిటని ప్రశ్నిస్తూ ఆందోళనకు దిగిన జనసేన నేతలను పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గం. వారి పోరాటానికి జనసేన అండగా నిలబడుతుంది. ఈ ప్రభుత్వం కూలిపోయే రోజు ఎంతో దూరం లేదు.
– పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు
కాగా.. గతంలోనూ వైసీపీపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్యాకేజ్ స్టార్ అనే సన్నాసుల్లారా పిసికి చంపేస్తా.. చెప్పుతో కొడతా నా కొడకల్లారా. విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నా.. ఒక్క పెళ్లి చేసుకుని 30 మందితో తిరిగే మీరా నాకు చెప్పేది’ అంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు. పిల్లల ఎఫ్‌డీ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసి పార్టీ కార్యాలయాన్ని నిర్మించానని, సీఎం ఫండ్ ఇతర సేవా కార్యక్రమాలకు రూ. 12 కోట్లు ఇచ్చానని చెప్పారు. మనలో ఇన్ని కులాలున్నా మనమంతా ఆంధ్రులం అన్న భావన మీలో ఎందుకుండదు? అని నిలదీశారు. ఇప్పటివరకు పవన్ కల్యాణ్ మంచితనం చూశారని, ఇకపై మరో రూపం చూస్తారని జనసేనాని ధ్వజమెత్తారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..